ఇప్ప‌ట్లో బంగారం ధ‌ర త‌గ్గ‌దా..?

Gold Rate on February 3rd. గురువారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.500 పెరుగ‌గా, శుక్ర‌వారం రూ.600 పెరిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Feb 2023 7:25 AM IST
ఇప్ప‌ట్లో బంగారం ధ‌ర త‌గ్గ‌దా..?

మ‌న దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ అన్న సంగ‌తి తెలిసిందే. సంద‌ర్భం ఏదైనా స‌రే ప‌సిడిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఇష్ట‌ప‌డుతుంటారు. అందుకునే కొనుగోలుదారులు ఎల్ల‌ప్పుడు వాటి ధ‌ర‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచుతారు. గురువారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.500 పెరుగ‌గా, శుక్ర‌వారం రూ.600 పెరిగింది. దీంతో రెండు రోజుల్లో రూ.1,110 పెరిగింది. త్వ‌ర‌లోనే పెళ్లిళ్ల సీజ‌న్ ప్రారంభం కానుండ‌డంతో కొన‌క త‌ప్ప‌డం లేద‌ని అంటున్నారు. చూస్తుంటే బంగారం ధ‌రల పెరుగుద‌ల ఇప్ప‌ట్లో త‌గ్గేలా లేద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,470

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,610

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,470

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,510

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.53,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.58,470

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,470

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,470

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,600, 24 క్యారెట్ల ధర రూ.58,470

Next Story