అక్షయ తృతీయ.. బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..?

Gold prices in Hyderabad bullion market. వైశాఖ శుద్ధ తదియ నాడు మనం అక్షయ తృతీయ జరుపుకొంటాము. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపద

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 May 2021 2:04 AM GMT
gold price

అక్షయ అంటే తరగనిది అని అర్థం. వైశాఖ శుద్ధ తదియ నాడు మనం అక్షయ తృతీయ జరుపుకొంటాము. శ్రీమహాలక్ష్మీ అమ్మవారు అన్ని ఐశ్వరాలకు అధినేత్రి. ఆమె అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఏ లోటు ఉండదని నమ్మకం. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు. భారతీయ సమాజంలో బంగారానికి ఎక్కువ విలువ ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేనంతా బంగారం మనదేశంలోనే ఉంది. బంగారం అనేది సంపదకు చిహ్నం. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపద ఉంటుందన్న నమ్మకంతో బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అందుక‌నే ఈ రోజు క‌నీసం ఒక్క గ్రామైనా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. మ‌రీ అక్ష‌య తృతీయ రోజు బంగారం, వెండి ధ‌ర‌లు త‌గ్గాయా..? పెరిగాయా..? ఓ సారి చూద్దాం...

కొద్ది రోజులుగా బంగారం ధరల్లో ఒడిదొడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధర... ఇవాళ మాత్రం నిలకడగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కిందికి కదలడంతో బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,560 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,500 కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధరలు హైదరాబాద్, విశాఖ, విజయవాడ, చెన్నై, బెంగళూరులో ఒకేలా ఉన్నాయి. ముంబైలో 44,720, కోల్‌కతాలో 45,800, న్యూఢిల్లీలో 45,900 పలుకుతోంది. కాగా.. వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ. 76,000 వద్ద కొనసాగుతోంది.
Next Story