మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గుతోన్న బంగారం ధరలు..7 నెలల్లో రూ.13 వేల వరకు తగ్గింపు

Gold Prices Fall Down. దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా చోటుచేసుకుంటున్న వివిధ పరిణామాల

By Medi Samrat  Published on  5 March 2021 8:14 AM IST
Gold Prices Fall Down

దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా చోటుచేసుకుంటున్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరల్లో మార్పు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పసిడి ధరలు దిగి వస్తున్నాయి. అయితే బంగారం కొనుగోలు చేసే వారికి ఇది సరైన సమయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా తగ్గదా ఇంతేనా అనే ప్రశ్నకు సమాధానం లేదంటున్నారు. ఇంకా తగ్గవచ్చనే అంచనా ఉంది కానీ ఎంత వరకూ తగ్గుతుందో చెప్పలేమని చెబుతున్నారు. అయితే వచ్చే 2 నెలల తర్వాత నుంచి బంగారం ధరలు పెరుగుతాయనే అంచనాతో ఉన్నారు. మళ్లీ 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు రూ.50,000 చేరే అవకాశం కూడా ఉందని వారు మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది ఆగస్టు 7న నగల బంగారం ధర 10 గ్రాములు అత్యధికంగా రూ.54,200 ఉంది. మరి ఇప్పుడో రూ.42 వేలకుపైగా ఉంది. అంటే… ఈ 7 నెలల్లో బంగారం ధర రూ.12,100 తగ్గింది. అదే 24 క్యారెట్ల బంగారమైతే 7 నెలల్లో రూ.13,200 తగ్గింది

తాజాగా గురువారం సాయంత్రం ఢిల్లీలో 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950 ఉంది. ఇక దేశ ఆర్థిక నగరం ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,900 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ42,1700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 46,020 వద్ద కొనసాగుతోంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 41,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,600 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.41,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,600వద్ద ఉంది. విజయడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.41,800 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,600 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,600 ఉంది.

ఇక కిలో వెండి ఢిల్లీలో రూ.66,200 ఉండగా, హైదరాబాద్‌లో రూ.70,400 ఉంది. ముంబైలో రూ.66,200 ఉండగా, చెన్నైలో రూ.70,400 ఉంది. బెంగళూరులో రూ.66,200 వద్ద కొనసాగతోంది. కాగా, దేశంలోని బంగారం ధరలపై ప్రభావం చూపే కారణాలు చాలా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఇటీవల నుంచే బంగారం ధరల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులు ధరలు పెరుగుతుంటే.. మరి కొన్ని రోజులు తగ్గుముఖం పడుతున్నాయి.




Next Story