జెట్‌స్పీడ్‌తో దూసుకెళ్తోన్న బంగారం ధరలు..లక్షన్నరకు చేరే ఛాన్స్
బంగారం ధరలు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి
By - Knakam Karthik |
బంగారం ధరలు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. బంగారం ధర పెరుగుదల ఆర్థిక ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇప్పుడు బంగారం కేవలం ఆభరణాలకే కాదు.. పెట్టుబడిగా కూడా మరింత ప్రాముఖ్యత పెరగటంతో వీటి ధరలు సామాన్య ప్రజలు అందుకోలేని.. కనీసం తలెత్తి చూడలేని స్థాయికి దూసుకెళ్తున్నాయి.
సెప్టెంబర్ 12న హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.771 పెరిగి రూ.1,10,509 నుంచి రూ.1,11,280కి చేరుకుంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.1,01,300 నుంచి రూ.1,02,000కి చేరుకుంది. ఇక 18 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.580 పెరిగి రూ.82,880 నుంచి రూ.83,460కి చేరుకుంది.
గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మాన్ శాక్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. బంగారం ధరలు దాదాపు 50శాతం వరకూ పెరిగే చాన్స్ ఉందట. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని స్థాయికి గోల్డ్ రేటు చేరుతుందని అంచనా వేసింది. 10 గ్రాముల ధర రూ.1.55 లక్షలకు వచ్చే ఏడాది జూన్-జులై నాటికి చేరుకోవచ్చని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ద్రవ్యోల్భణంతో మూడేళ్ళల్లో 5 రెట్లు పెరుగుదల.. సెంట్రల్ బాంక్ పాలసీలు, రూపాయి విలువ పతనమూ పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.