వ‌రుస‌గా రెండో రోజు పెరిగిన బంగారం ధ‌ర

వ‌రుస‌గా రెండో రోజు ప‌సిడి ధ‌ర పెరిగింది. శ‌నివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ. 200 పెరిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 March 2023 1:51 AM GMT
వ‌రుస‌గా రెండో రోజు పెరిగిన బంగారం ధ‌ర

మ‌న దేశంలో బంగారానికి డిమాండ్ అధికంగా ఉంటుంది. కేవ‌లం అలంక‌ర‌ణ కోస‌మే కాకుండా ఆర్థిక అవ‌స‌రాల్లో ప‌స‌డి ఆదుకుంటుంద‌ని బావించ‌డ‌మే అందుకు కార‌ణం. దీంతో సంద‌ర్భం ఏదైనా స‌రే ప‌సిడిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఇష్ట‌ప‌డుతుంటారు. వ‌రుస‌గా రెండో రోజు ప‌సిడి ధ‌ర పెరిగింది. శ‌నివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ. 200 పెరిగింది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,000 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,000 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,150

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,650

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.60,000

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000, 24 క్యారెట్ల ధర రూ.60,000

గమనిక : ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణాలు వ‌ల్ల నిత్యం ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Next Story