పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి కూడా అమాంతం..
దేశంలో పసిడి ధరలు ఆదివారం నాడు భారీగా పెరిగాయి. నేడు 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర రూ.500 పెరిగి రూ.56,300 వద్ద కొన
By అంజి Published on 21 May 2023 1:38 AM GMTపసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి కూడా అమాంతం..
దేశంలో పసిడి ధరలు ఆదివారం నాడు భారీగా పెరిగాయి. నేడు 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర రూ.500 పెరిగి రూ.56,300 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ.550 పెరిగి రూ. 61,420గా కొనసాగుతోంది. ఇక దేశీయ మార్కెట్‍లో వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.75,300గా ఉంది. అయితే బంగారం కొనుగోలుదారులు.. కొనేముందు ఎల్లప్పుడూ వాటి ధరలపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,470
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,570
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,960
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,470
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,470
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,470
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,420
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,420
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,420
వెండి కూడా..
మార్కెట్‍లో ఆదివారం నాడు వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.1000 పెరిగి.. రూ.75,300గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ..79,000 పలుకుతోంది. ఢిల్లీ, కోల్‌కతాలో వెండి ధర రూ. 75,300గా ఉంది.
గమనిక : ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణాలు వల్ల నిత్యం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.