Gold Rates: మళ్లీ పెరిగిన బంగారం ధర.. వెండి కూడా
పసిడి, వెండి కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. నాలుగు రోజుల విరామం తర్వాత గురువారం మళ్లీ బంగారం ధర పెరిగింది.
By అంజి Published on 20 April 2023 2:30 AM GMTGold Rates: మళ్లీ పెరిగిన బంగారం ధర.. వెండి కూడా
పసిడి, వెండి కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. నాలుగు రోజుల విరామం తర్వాత గురువారం మళ్లీ బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర రూ.200 పెరిగి గురువారం ఉదయం సమయానికి రూ.56,050 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ.230 పెరిగి.. రూ. 61,150గా కొనసాగుతోంది. దేశీయ మార్కెట్‍లో నేడు వెండి ధర కూడా అధికమైంది. కిలో వెండి ధర రూ.200 పెరిగి రూ.77,600కు చేరింది. అయితే బంగారం కొనుగోలుదారులు.. కొనేముందు ఎల్లప్పుడూ వాటి ధరలపై ఓ కన్నేసి ఉంచడం మంచిది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,310
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200
- అహ్మదాబాద్‍లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు గురువారం పెరిగాయి. కిలో వెండి ధర రూ.200 పెరిగి.. రూ. 77,600కు చేరుకుంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ..81,000పలుకుతోంది. వెండి ధర ఢిల్లీ, కోల్‌కతాలో రూ. 77,600గా ఉంది.
గమనిక : ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణాలు వల్ల నిత్యం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.