Gold Rates: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం ధర.. భారీగా దిగొచ్చిన వెండి

ప‌సిడి, వెండి కొనుగోలుదారుల‌కు శుభవార్త. బుధవారం దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. రికార్డు స్థాయికి చేరిన

By అంజి  Published on  19 April 2023 1:12 AM GMT
Gold Rate Today,Gold Price,Telugu News,Business, Silver Rate

Gold Rates: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం ధర.. భారీగా దిగొచ్చిన వెండి

ప‌సిడి, వెండి కొనుగోలుదారుల‌కు శుభవార్త. బుధవారం దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు.. గడిచిన నాలుగు రోజులుగా శాంతిస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధ‌ర రూ.90 తగ్గి.. రూ.55,850 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ.110 దిగొచ్చి.. రూ. 60,920గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 1 గ్రాము గోల్డ్ ధర రూ.6,092గా ఉంది. అయితే బంగారం కొనుగోలుదారులు.. కొనేముందు ఎల్ల‌ప్పుడూ వాటి ధ‌ర‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచడం మంచిది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,920

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,070

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,600

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,920

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,970

- అహ్మదాబాద్‍లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.60,970

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,920

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,920

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల ధర రూ.60,920

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు బుధవారం భారీగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.1,100తగ్గి.. రూ. 77,400కు చేరుకుంది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ.80,500 పలుకుతోంది. వెండి ధరలు ఢిల్లీ, కోల్​కతాలో రూ.​ 77,400 గా ఉంది.

గమనిక : ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణాలు వ‌ల్ల నిత్యం ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Next Story