షాకిచ్చిన బంగారం.. మళ్లీ పెరిగిన ధరలు
Gold and silver prices Today.కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నేడు కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది.
By తోట వంశీ కుమార్ Published on 9 April 2021 10:59 AM GMTమనదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నేడు కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం పైకి కదలడంతో.. బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. శుక్రవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 370 పైకి ఎగసి రూ. 46,900 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి రూ. 43, 000 కు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర రూ.800 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.71,300కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
-దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 350 పెరిగి.. 45,150 గా ఉంది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 49,250 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 66,660గా ఉంది.
- ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 44,550 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,550 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,660 గా ఉంది.
-కర్నాటక రాజధాని బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 43000 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 46,900 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 66,660 గా ఉంది.
- తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 43,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,400 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,300గా ఉంది.