భారీగా తగ్గిన బంగారం ధర..
Gold and Silver price today in Hyderabad.బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 2 March 2021 1:06 PM IST
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా నిన్నటితో పోల్చుకుంటే భారీగానే బంగారంధర తగ్గుముఖం పట్టింది. సోమవారం ఢిల్లీ, హైదరాబాద్ నగరాలలో ఉన్నధరతో పోల్చుకుంటే మంగళవారం దాదాపు రూ.950 వరకు తగ్గింది. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటుంటాయి. బంగారం కొనే వారు తాజా ధరలను చూసి కొనుగోలు చేయాలని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
తాజాగా ధరలను పరిశీస్తే..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,930 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,310 ఉంది. దేశ రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44.950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,420, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,370 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,930, ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,100 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,930 వద్ద కొనసాగుతోంది.
కిలో వెండి ధర..
ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,600 ఉండగా, ముంబైలో రూ.66,600 ఉంది. చెన్నైలో రూ.72000, హైదరాబాద్‌లో రూ. 72,000 , బెంగళూరులో ర ఊ.67,600, విజయవాడలో రూ.72000 వద్ద ఉంది.