పాన్ 2.0 పొందండి ఇలా..
కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం పాన్ 2.0 ప్రాజెక్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
By అంజి Published on 16 Dec 2024 11:15 AM ISTపాన్ 2.0 పొందండి ఇలా..
కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం పాన్ 2.0 ప్రాజెక్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పాన్ కార్డులు జారీ చేసేందుకు క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ కొత్త కార్డు డేటా భద్రతకు భరోసా ఇస్తుంది. అలాగే సంబంధిత పనులను సులభతరం చేస్తుంది. ఈ కార్డు తీసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు తగ్గడమే కాకుండా, కేంద్రీకృత వ్యవస్థ సకాలంలో మన సమస్యలను పరిష్కరిస్తుంది. అయితే ఈ కొత్త కార్డును పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
పన్ను చెల్లింపుదారులు పాత్ర అడ్రస్‌ను కొత్త పాన్‌కార్డులో ఉచితంగా మార్చుకోవచ్చు. ఇలా చేస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం వద్ద అడ్రస్ అప్డేట్ అవుతుంది. దీంతో క్యూఆర్ కోడ్ ఈ - పాన్ కార్డును ట్యాక్స్ ప్లేయర్ల రిజిస్టర్డ్ ఐడీకి పంపిస్తారు. రూ.50 చెల్లించి పాన్ కార్డుదారులు కొత్త కార్డులను ప్రింట్ చేయించుకోవచ్చు. అయితే పాన్ కార్డులో అడ్రస్ అప్డేట్ చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించొద్దు. కార్డుపై అడ్రస్ ఉండటం చాలా అవసరం. ఆధార్ ఆధారంగా ఇది పూర్తి చేయవచ్చు. ఎన్‌ఎస్‌డీఎల్ ద్వారా ఉచితంగా అడ్రస్ ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
- ముందుగా NSDL వెబ్‌సైట్‌కు సంబంధించి అడ్రస్ అప్డేట్ ఫెసిలిటీని ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో మీ పాన్‌కార్డు, ఆధార్, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు ఎంటర్ చేసి ఆధార్ ఆధారిత అప్డేట్ ఆప్షన్ టిక్ చేసి సబ్మిట్ చేయాలి.
- ఆ తర్వాత కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీకి వచ్చిన ఓటీపీలు ఎంటర్ చేసి ఈ కేవైసీ పూర్తి చేసి, సబ్మిట్ చేయాలి.
- మీరు మార్చుకోవాలంటే మొబైల్ నంబర్, ఈ మెయిల్ అప్డేట్ చేసుకునేందుకు ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మార్చితే కొత్త నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐటీ అథెంటికేట్ చేయాలి.
- మాస్క్‌డ్ రూపంలో కనిపించే ఆధార్, ఇతర వివరాలు చెక్ చేసుకుని, సరిగా ఉంటే వెరిఫై పై క్లిక్ చేయాలి. అప్పుడు కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అడ్రస్ అప్డేట్‌పై క్లిక్ చేసి, ఉచితంగా మీ అడ్రస్ మార్చుకోవాలి.
- అడ్రస్ ఒకసారి అప్డేట్ అయితే మీ ఈ మెయిల్ ఐడీకి ఈ- పాన్ పంపిస్తారు. మీరు రూ.50 చెల్లించినట్టయితే కార్డు ప్రింట్ చేసి పంపుతారు.