అత్యంత సంపన్నుల జాబితా.. టాప్‌-3లో గౌతమ్‌ అదానీ.. ఇదే ఫస్ట్‌టైమ్.!

Gautam Adani is now the 3rd richest man in the world. ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ మూడవ స్థానంలో ఉన్నారు.

By అంజి  Published on  30 Aug 2022 9:51 AM IST
అత్యంత సంపన్నుల జాబితా.. టాప్‌-3లో గౌతమ్‌ అదానీ.. ఇదే ఫస్ట్‌టైమ్.!

ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ మూడవ స్థానంలో ఉన్నారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ డేటా ఈ విషయాన్ని తెలిపింది. ప్రస్తుతం అదానీ ఆస్తులు సుమారు 137 బిలియన్ల డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల లిస్ట్‌లో ఎలన్‌మస్క్‌, జెఫ్‌ బేజోస్‌ ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో 60 ఏళ్ల గౌతమ్‌ అదానీ నిలిచారు. టెస్లా చీఫ్ ఎల‌న్ మ‌స్క్ ఆస్తులు 251 బిలియ‌న్ల డాల‌ర్లు ఉంది. అమెజాన్ ఫౌండ‌ర్‌, సీఈవో జెఫ్ బేజోస్ ఆస్తుల విలువ 153 బిలియ‌న్ల డాల‌ర్లుగా ఉందని బ్లూమ్‌బ‌ర్గ్ పేర్కొన్న‌ది.

ఫ్రెంచ్ వ్యాపార‌వేత్త లూయిస్ విటాన్ వ్య‌వ‌స్థాప‌కుడు బెర్నార్డ్ అర్నాల్ట్‌ను వెనక్కి నెట్టి అదానీ మూడ‌వ స్థానానికి చేరుకున్నారు. తాజా బ్లూమ్‌బ‌ర్గ్ డేటా ప్ర‌కారం.. ఆసియాకు చెందిన సంపన్నుల్లో ఫస్ట్‌టైమ్‌ టాప్‌ త్రీ లిస్ట్‌లోకి చేరారు. ఇక భారత్‌కు చెందిన ముఖేశ్‌ అంబానీ, చైనాకు చెందిన అలీబాబా గ్రూప్‌ జాక్‌ మా, ఇతర ధనవంతులు ప్రపంచ కుబేరుల లిస్ట్‌లో ఉన్నా.. వాళ్లు ఎప్పుడు టాప్‌ త్రీలోకి రాలేదు. అదానీ గ్రూపు స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు గౌత‌మ్ అదానీ. దేశంలోనే అతి పెద్ద పోర్ట్ ఆప‌రేట‌ర్‌ కూడా.

బొగ్గు వ్యాపారంలోనూ అదానీ గ్రూపు మొదటి స్థానంలో ఉంది. 2021, మార్చి 31 నాటికి ఆ సంస్థ సుమారు 5.3 బిలియ‌న్ల డాల‌ర్ల రెవెన్యూను ఆర్జించింది. ఎన్డీటీవీలో 29 శాతం వాటాను కొనుగోలు చేయ‌నున్న‌ట్లు అదానీ సంస్థ గ‌త వారం ఓ ప్ర‌క‌ట‌న చేసింది. అయితే, ఈ డీల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదానికి లోబడి ఉంటుందని ఎన్‌డిటివి తెలిపింది, దీనిని సమ్మేళనం తిరస్కరించింది. అలాగే, ఫిచ్ గ్రూప్ యూనిట్ క్రెడిట్‌సైట్స్ ఇటీవల అదానీ గ్రూప్ తీవ్ర పరపతిని కలిగి ఉందని, అప్పుల ఊబిలో కూరుకుపోవచ్చని పేర్కొంది.

Next Story