ఈ-కామర్స్ ఆఫర్ల పండుగ..జీఎస్టీ తగ్గడంతో కొనుగోళ్లు పెరిగే ఛాన్స్
ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల పండుగను ప్రకటించాయి.
By Knakam Karthik
ఈ-కామర్స్ ఆఫర్ల పండుగ..జీఎస్టీ తగ్గడంతో కొనుగోళ్లు పెరిగే ఛాన్స్
ముంబై: ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల పండుగను ప్రకటించాయి. దసరా పండుగను పురస్కరించుకొని మొబైల్ ఫోన్లు, ఏసీలు, టీవీలు, ఫ్రిజ్‌లు వంటి గృహెూపకరణాలు డిస్కౌంట్ ధరకే అందించనున్నాయి. అమెజాన్ పండుగ సీజన్ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. ప్రైమ్ సభ్యులు డీల్లకు ముందస్తు యాక్సెస్ పొందనున్నారు. ఆఫర్లు 24 గంటల ముందుగానే అందుబాటులో ఉంటాయి. ఈ సేల్ శాంసంగ్, రియల్ మీ, యాపిల్, డెల్, ఆసుస్ వంటి బ్రాండ్ల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్ ఉండనుంది. సెప్టెంబర్ 22 నుండి కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి రావడంతో టీవీలు, ఏసీలు సహా పలు ఎలక్ట్రానిక్ వస్తువులు మరింత తక్కువ ధరలకే లభించనున్నాయి.
అమెజాన్ ఇప్పటికే సేల్ కోసం కొన్ని డీల్లను వెల్లడించింది. వాటిలో యాపిల్, ఐక్యూ, వన్ ప్లస్ వంటి బ్రాండ్ల ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్లు అందిస్తాయి. ఎస్బీఐ కార్డుతో చేసిన కొనుగోళ్లపై కస్టమర్లు అదనంగా 10 శాతం తగ్గింపుతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా పొందవచ్చు. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కూడా సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. ఈ సేల్ ఆపిల్, శామ్‌సంగ్, మోటరోలా, వివో వంటి బ్రాండ్ల ఫోన్లపై భారీ ఆఫర్లు ఉండనున్నాయి