భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న పెట్స్ బిజినెస్
దేశంలోం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వ్యాపారాల్లో పెట్స్ బిజినెస్ ఒకటి. ముఖ్యంగా మధ్య తరగతి భారతీయుల్లో పెంపుడు జంతువులను
By అంజి Published on 5 Jun 2023 12:15 PM ISTభారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న పెట్స్ బిజినెస్
దేశంలోం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వ్యాపారాల్లో పెట్స్ బిజినెస్ ఒకటి. ముఖ్యంగా మధ్య తరగతి భారతీయుల్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం ఒక ఇష్టమైన వ్యాపకంగా మారుతోంది. దీంతో పెట్స్ క్లినిక్స్, వాటి పోషణ, గ్రూమింగ్, వాటి ఫుడ్ బిజినెస్ వందల కోట్లకు చేరగా, విదేశీ పెట్స్ అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి.
మార్కెట్‌లో గణాంకాలు
భారత్‌లో పెట్ కేర్ ఇండస్ట్రీ విలువ రూ.4,552 కోట్లు. ఇది 2030 నాటికి రూ.15,460 కోట్లకు చేరుతుందని అంచనా. భారత్‌లో డాగ్ ఫుడ్ మార్కెట్ ఏటా 18.89 శాతం చొప్పున పెరుగుతోంది. 2027 నాటికి పెట్‌ఫుడ్ పరిమాణం 0.81 బిలియన్ కేజీలకు పెరగనుంది. 2023లో మన దేశంలో ఒక పెట్‌కు సగటున 0.33 కిలోల ఫుడ్ కొనుగోలు చేశారు. 2014 - 2019 కాలంలో పెట్స్‌ను పెంచే కుటుంబాల సంఖ్య రెట్టింపయ్యింది. భారతీయ మార్కెట్‌లో దాదాపు 80 బ్రాండ్స్ 1000కిపైగా ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్నాయి.
అనుబంధ సేవల విస్తరణ
- పెట్స్ గ్రూమింగ్, ఎయిర్, నెయిల్ కటింగ్, మసాజ్ వంటి సేవలకు నెలకు సగటున పెడుతున్న ఖర్చు.. రూ.1150 నుంచి 3,500
- డాగ్స్ యాక్సెసరీస్ కోసం 2020లో 20 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా, 2022 నాటికి ఇది 77 మిలియన్ డాలర్లకు పెరిగింది.
- పెట్స్‌ను కేఫ్‌లకు, రెస్టారెంట్స్‌కు తీసుకుపోవడం ఒక అలవాటుగా మారిన నేపథ్యంలో అలాంటి రెస్టారెంట్ల సంఖ్యా పెరుగుతోంది.
- మొత్తం పెట్ బిజినెస్‌లో డాగ్ ఫుడ్ మార్కెట్ వాటా మూడు వంతులుగా ఉంటుంది.
- హెడ్స్ ఆఫ్ ఫర్ టైల్స్ అనే సంస్థ పెట్ గ్రూమింగ్‌లో 37 మిలియన్ డాలర్ల పెట్టుబడుటు పెట్టడమే గాక దేశ వ్యాప్తంగా 35 సెంటర్లలో ఈ సేవలను అందిస్తోంది.
- డిజిటల్ పెట్ కేర్ స్టార్టప్ మెట్రిక్ 3.7 మిలియన్ డాలర్లు, మరో పెట్ కేర్ సంస్థ సూపర్ టైల్స్ 10 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి.
- ప్రపంచం మొత్తంలో పెట్ కేర్ వ్యాపారం వేగంగా పెరుగుతున్న దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉందని డెసిఫర్ అనే మార్కెటింగ్ రిసెర్చ్ ఏజెన్సీ వెల్లడించింది.
ముంబై టాప్
ముంబైలోని 'పూప్ ఎన్ గూఫ్' పెట్ రిసార్ట్‌లో పెట్స్ గడిపేందుకు 5 గంటలకు 500 రూపాయలు, రోజుకు 11 వందల వరకు వసూలు చేస్తున్నారు. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ సౌకర్యం ఉంది. ఇక్కడ పెట్స్‌కు బిహేవియర్ ట్రైనింగ్, స్విమ్మింగ్ వంటివి నేర్పిస్తారు. 8 సెషన్లకు 4 వేల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు.