ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగించే వారు దాదాపుగా లేరంటే అతిశయోక్తి కాదేమో. ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు రాత్రి పడుకునే ముందు వరకు ప్రతి పది నిమిషాలకొకసారి వీటిని ఉపయోగించకుండా ఉండలేరు చాలా మంది. అలాంటి ఈ సోషల్ మీడియాలు పనిచేయపోతే ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఒకటి కాదు రెండు దాదాపు ఏడు గంటల పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూడు సామాజిక మాధ్యమాల సేవలు స్తంబించిపోయాయి. సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 4 గంటల వరకు ఇవి పనిచేయలేదు. దీంతో ఏవి జరిగిందో తెలియక కోట్లాది మంది ప్రజలు ఆగమాగం అయ్యారు.
యూజర్లు పంపించిన మెసేజ్‌లు ఫార్వర్డ్ అవలేదు. మొదటగా చాలామంది తమకు మాత్రమే ఇలా జరుగుతోందా.. లేక అందరికీ ఇదే సమస్య తలెత్తిందా అన్న అయోమయంలో పడ్డారు. దీనికి సంబంధించి ఇతర మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం ప్రారంభించారు. సేవలను పునరుద్దరించిన అనంతరం వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి పేస్‌బుక్ క్షమాపణ చెప్పింది. మాపై ఆధారపడిన కోట్ల మంది ప్రజలకు, వ్యాపార సేవలను పొందుతున్న వారికి క్షమాపణలు. నిలిచిపోయిన సేవలను పునరుద్దరించడంలో తిరిగి ఆన్‌లైన్‌కు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. మాతో సహకరించినందుకు ధన్యవాదాలు అంటూ పేస్‌బుక్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
భారత్‌లో ఫేస్‌బుక్ కు 41 కోట్ల మంది.. వాట్సప్‌కు సుమారు 53కోట్ల మంది., ఇన్‌స్టాగ్రామ్‌కు 21 కోట్ల మందికిపైగా వినియోగదారులు ఉన్నారు.