ఈఎంఐ ఒక్కరోజు లేటైనా.. కలిగే నష్టాలివే

ఈఎంఐ ఒక్కరోజు లేటుగా చెల్లిస్తే పెద్దగా నష్టాలు ఉండవని చాలా మంది అనుకుంటారు. కానీ దానివల్ల అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

By అంజి  Published on  5 Dec 2024 5:00 AM GMT
EMI payment, EMI, Banking, Credit score

ఈఎంఐ ఒక్కరోజు లేటైనా.. కలిగే నష్టాలివే

ఈఎంఐ ఒక్కరోజు లేటుగా చెల్లిస్తే పెద్దగా నష్టాలు ఉండవని చాలా మంది అనుకుంటారు. కానీ దానివల్ల అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొందరు ఈఎంఐ చెల్లించే రోజు నాటికి కూడా ఖాతాలో సరిపడా బ్యాలెన్స్‌ ఉంచుకోరు. ఈఎంఐ డిడక్ట్‌ కాలేదని బ్యాంక్‌ నుంచి మెసేజ్‌ వచ్చేదాకా దాని గురించి పట్టించుకోరు. ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల పెనాల్టీ (లేట్‌ ఫీ) కట్టాల్సి ఉంటుంది.

అయితే, పెనాల్టీ కడితే సరిపోతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈఎంఐ గడువు దాటి ఒక్కరోజు పూర్తయినా అది మీ క్రెడిట్‌ స్కోర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు అనుకున్నదానికంటే అధికంగా నష్టపోవాల్సి వస్తుంది. మీరు ఇన్నాళ్ల పాటు క్రమశిక్షణతో పేమెంట్‌లు చేసుకుంటూ నిర్మించుకున్న స్కోరు పడిపోతుంది.

ఇది తిరిగి పెరగాలంటే ఎక్కువ సమయం పడుతుంది. ఒకవేళ మీ క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే బ్యాంకులు రుణాలు కూడా మంజూరు చేయవు. చేసినా అధిక వడ్డీరేట్లు విధిస్తాయి. ఈఎంఐ విషయంలో తప్పు చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఎప్పుడూ మర్చిపోకూడదు.

Next Story