ట్విటర్ డీల్‌కు గుడ్ బై చెప్పిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్
Elon Musk Pulls Out Of twitter Deal.అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రముఖ సామాజిక దిగ్గజ సంస్థ ట్విటర్‌ను
By తోట వంశీ కుమార్ Published on 9 July 2022 11:33 AM ISTఅపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రముఖ సామాజిక దిగ్గజ సంస్థ ట్విటర్‌ను కొనుగోలు చేయాలని భావించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 44 బిలియన్ల డాలర్లతో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ డీల్ నుంచి తప్పుకున్నట్లు మస్క్ తాజాగా ప్రకటించారు. స్పామ్, ఫేక్ అకౌంట్లపై సమగ్రమైన సమాచారాన్ని ట్విటర్ ఇవ్వలేకపోయిందని, అందుకే ఆ ఒప్పందం నుంచి వైదొలుతున్నట్లు మస్క్ తెలిపారు. దీనిపై ట్విటర్ స్పందించింది. మస్క్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.
మస్క్‌తో అంగీకరించిన ఒప్పందాన్నినిబంధనల ప్రకారం రద్దు చేయడానికి సిద్దంగా ఉన్నామని ట్విట్టర్ బోర్డ్ చైర్మెన్ బ్రెట్ టేలర్ తెలిపారు. కాగా.. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఏదైనా కారణం వల్ల మస్క్ లావాదేవీని పూర్తిచేయకపోయినా, ఒప్పందాన్నిరద్దు చేసుకున్నా 1 బిలియన్ డాలర్లను ఫెనాల్లీ కింద ట్విటర్‌కు చెల్లించాల్సి ఉంటుంది.
గత ఏప్రిల్‌లో ట్విటర్ కొనుగోలు చేసేందుకు మస్క్ 44 బిలియన్ల డాలర్ల ప్రతిపాదనతో ముందుకు వచ్చాడు. అయితే కంపెనీ తమ నివేదికలో చెప్పినట్లుగా 5 శాతం కంటే తక్కువ స్పామ్ ఖాతాలున్నట్లు ఆధారాలు చూపించే వరకు డీల్ ముందుకు వెళ్లదని మే నెలలో మస్క్ చెప్పారు. కంపెనీ చెబుతున్న దాని కంటే నాలుగు నుంచి ఐదు రెట్లు అధికంగా స్వామ్ ఖాతాలున్నాయని మస్క్ ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ విషయంపై స్పష్టత వచ్చేంత వరకు డీల్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మస్క్ పేర్కొన్నారు. తాజాగా ట్విటర్ స్పామ్, ఫేక్ అకౌంట్లపై సమగ్రమైన సమాచారాన్ని ఇవ్వలేకపోయిందని అందుకే డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు మస్క్ తెలిపారు.