భయపెడుతున్న 'పింక్ వాట్సాప్'.. జాగ్త్రత సుమీ..!
Don't open pink whatsapp link.ఇటీవల కాలంలో అనేక ఫేక్ లింకులు వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్నారు. వ్యక్తిగత
By తోట వంశీ కుమార్ Published on 17 April 2021 12:17 PM ISTఇటీవల కాలంలో అనేక ఫేక్ లింకులు వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం కోసం సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త లింకుల్ని సృష్టించి వాటి ద్వారా మోసం చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే.. ఇటీవల 'పింక్ వాట్సాప్' అంటూ ఓ లింకు వైరల్ అవుతోంది. పొరపాటున దీనిని మీరు ఓపెన్ చేశారో ఇక మీ పని అంతే.. వాట్సాప్ పంపినట్లుగానే ఉన్న ఆ లింకు కు వాట్సప్‌కు ఎలాంటి సంబంధం లేదు.
సాధారణంగా వాట్సాప్ అనేది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అయితే.. కొత్త రంగుల్లో వాట్సాప్ వస్తోంది.. వచ్చేసింది అంటూ కొన్ని లింకులు వాట్సప్‌లో వస్తున్నాయి. ఆ లింకును క్లిక్ చేస్తే మీ వాట్సాప్ కలర్ మారుతుంది అనేది దాని సారాంశం. అలా పింక్ వాట్సాప్(pink whatsapp) అనే ఓ లింకు వైరల్ అవుతోంది. ఇది అచ్చం వాట్సాప్ లింకులాగే ఉంటుంది. దీనికి వాట్సాప్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఈ లింక్‌ను క్లిక్ చేస్తే.. మీ పేరు, మొబైల్ నెంబర్ తదితర వివరాలను అడుగుతుంది. ఆ తరువాత ఆ పేజీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు.
మీకు తెలియకుండానే మీ ఫోన్లో ఉన్న అందరు కాంటాక్టులకు ఆ లింక్ వెళ్లి పోతుంది. మీరు చేసే ఈ చిన్న మిస్టేక్ ద్వారా వారు కూడా మోస పోయే ప్రమాదం ఏర్పడుతుంది. మీరు సభ్యులుగా ఉన్న వాట్సాప్ గ్రూపులకు కూడా ఆ లింక్ మీకు సంబంధం లేకుండానే వెళ్లి పోతుంది. మీ ఫ్రెండ్సే పంపినా కూడా ఆ లింకును క్లిక్ చేయొద్దు. కొత్త వాట్సాప్ అంటూ ఏదైనా వస్తే వాట్సాప్ ప్లే స్టోర్ ద్వారానే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది అని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే ఈ ఫేక్ లింక్ ఓపెన్ చేసి ఉంటే.. ఫోన్‌ను రీసెట్ చేయండి. మెయిల్ ఐడీ, బ్యాంకు ఖాతాలు, సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లు కూడా ఒకసారి మార్చుకుంటే మంచిది అని, ముఖ్యంగా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను మార్చుకుంటే మంచిదని అంటున్నారు.