క్రెడిట్‌ స్కోర్‌: ఈ అపోహలు వద్దు

క్రెడిట్‌ కార్డు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే చాలా మంది క్రెడిట్‌ కార్డును ఉపయోగిస్తుంటారు.

By అంజి  Published on  20 Nov 2024 1:45 PM IST
credit score, credit Card, Bank

క్రెడిట్‌ స్కోర్‌: ఈ అపోహలు వద్దు

క్రెడిట్‌ కార్డు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే చాలా మంది క్రెడిట్‌ కార్డును ఉపయోగిస్తుంటారు. కానీ, క్రెడిట్‌ స్కోరును పెంచుకునే క్రమంలో కొందరు ఇబ్బందులు పడతారు. ఈ నేపథ్యంలో కొన్ని అపోహలకు గురవుతుంటారు. ఈ అపోహలను వీడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆదాయం అధికంగా ఉంటేనే క్రెడిట్‌ స్కోర్‌ మెరుగ్గా ఉంటుంది అనేది సరికాదు. సకాలంలో బిల్లులు చెల్లించడం, తక్కువ క్రెడిట్‌ వినియోగం వంటివే స్కోరు విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి.

కార్డును ఎక్కువగా వినియోగిస్తేనే స్కోర్‌ పెరుగుతుంది అనుకుంటారు. కానీ, క్రెడిట్‌ కార్డ్‌ లిమిట్‌లో 30 నుంచి 40 శాతం కంటే ఎక్కువ వాడకూడదు.

పాత క్రెడిట్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలు రద్దు చేసుకుంటే.. క్రెడిట్‌ స్కోరు పెరిగే అవకాశం ఉందనే వాదనలో నిజం లేదు. ఇలా చేస్తే.. క్రెడిట్‌ స్కోరు తగ్గే ప్రమాదం ఉంది. మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌కు క్రెడిట్‌ హిస్టరీ ఉండటం కూడా అవసరమే.

పడిపోయిన క్రెడిట్‌ స్కోర్‌ ఇక పెరగదు అనే ఆందోళన చాలా మందిలో ఉంటుంది. బిల్లులను సక్రమంగా చెల్లిస్తే క్రెడిట్‌ స్కోర్‌ కచ్చితంగా పెరుగుతుంది.

Next Story