ట్రంప్‌కి కలిసొచ్చిన కాలం.. ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి కాలం కలిసి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 26 March 2024 12:17 PM ISTట్రంప్‌కి కలిసొచ్చిన కాలం.. ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి కాలం కలిసి వచ్చింది. ట్రంప్‌కు జరిమానా విధింపు విషయంలో కోర్టులో ఊరట లభించింది. అంతేకదు. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆయనకు సంబంధించిన కంపెనీ డీల్ కూడా పూర్తయింది. దాంతో... డొనాల్డ్ ట్రంప్ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో తొలి 500 మంది సంపన్నుల జాబితాలో డొనాల్డ్ ట్రంప్ స్థానం దక్కించుకున్నారు. తాజాగా అంచనాల ప్రకారం ట్రంప్ సంపద ట్రంప్ సంపద విలువ 4 బిలియన్ డాలర్లు పెరిగి 6.5 బిలియన్ డాలర్లకు చేరింది. డొనాల్డ్ ట్రంప్ ఆస్తుల విలువ ఇంతమొత్తంలో ఎప్పుడూ లేదని అక్కడి మీడియా సంస్థలు చెబుతున్నాయి.
గతంలో తన సంపద గురించి అసత్యాలు చెప్పినందుకు డొనాల్డ్ ట్రంప్‌పై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో దిగువ కోర్టు విధించిన 45.4 కోట్ల డాలర్ల జరిమానా విధించారు. ఈ జరిమానాను నిలిపివేయాలని కోరుతూ ట్రంప్ న్యూయార్క్ అప్పీల్స్ కోర్టును ఇటీవల ఆశ్రయించారు. దిగువ కోర్టు ఉత్తర్వులు అమలు కాకుండా నిలిపివేయడానికి అప్పీల్స్ న్యాయస్థానం షరతు విధించింది. పది రోజుల్లో 17.5 కోట్ల డాలర్లను చెల్లించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని జమ చేస్తే 45.4 కోట్ల డాలర్లను వసూలు చేయకుండా నిలుపుదల ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టు తెలిపింది.
మరోవైపు ట్రంప్‌కు చెందిన సోషల్ మీడియా 'ట్రూత్ సోషల్' సంస్థ డిజిటల్ వరల్డ్ అక్విజేషన్ కార్ప్‌తో విలీనం ప్రక్రియ పూర్తిచేసుకుంది. ఈ ప్రక్రియ 29 నెలలుగా సాగుతూనే వస్తోంది. మార్కెట్లో డీడబ్బ్యూఏసీ షేర్లు ఒకేసారి 35శాతానికి పెరిగాయి. దాంతో.. ట్రంప్ సంపద భారీగా పెరిగింది. 6.5బిలియన్ డాలర్లకు చేరింది. ఈ విషయాన్ని సీఎన్‌బీసీ తెలిపింది. తద్వారా డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు.