సామాన్యుడికి షాక్.. భారీగా పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధర
Domestic cylinder gets dearer by Rs 50.సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడింది. గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్
By తోట వంశీ కుమార్ Published on
6 July 2022 4:22 AM GMT

సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడింది. గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరను భారీగా పెంచేశాయి చమురు కంపెనీలు. 14.2 కేజీల సిలిండర్ ధరను రూ.50 మేర పెంచాయి. పెంచిన ధర నేటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దీంతో హైదరాబాద్‌లో రూ.1055గా ఉన్న గ్యాస్ బండ ధర రూ.1105కు చేరింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో రూ.1003గా ఉన్న సిలిండర్ ధర రూ.1053కు చేరింది. 5కేజీల డొమెస్టిక్ గ్యాస్ ధరను రూ.18 పెంచగా.. 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై మాత్రం రూ.8.50 తగ్గించింది.
సాధారణంగా ప్రతి నెల ఒకటవ తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తుంటారు. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ.183.50 మేర తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే నేడు గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ పై మాత్రం ధరను పెంచాయి.
Next Story