పెళ్లికి బ్యాంకు రుణం.. ఎలా తీసుకోవాలో తెలుసా?

కార్‌ లోన్‌, హోంలోన్‌ తరహాలోనే మ్యారేజ్‌ లోన్‌ కూడా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల నుంచి సులభంగా పొందొచ్చు. ఈ రుణం ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

By అంజి  Published on  7 July 2024 3:30 PM IST
bank loan, marriage, Credit score

పెళ్లికి బ్యాంకు రుణం.. ఎలా తీసుకోవాలో తెలుసా?

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఓ మధురమైన ఘట్టం. ఆ వివాహాన్ని బంధువులు, స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అందరూ కోరుకుంటారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల పెళ్లిని గ్రాండ్‌గా నిర్వహించాలని సామర్థ్యానికి మించి ఖర్చు పెడుతుంటారు. తమ పిల్లల పెళ్లి గురించి ఊరంతా మాట్లాడుకోవాలని.. దాచుకున్న డబ్బు ఖర్చు చేసి మరీ ఈ తంతు పూర్తి చేస్తుంటారు.

అయితే మరికొందరు మాత్రం చేతిలో సరిపడా డబ్బులేక ఈ వివాహ కార్యక్రమాన్ని తక్కువ బడ్జెట్‌లో, లిమిటెడ్ గెస్ట్‌ల మధ్య సాదాసీదాగా పూర్తి చేసేస్తుంటారు. ఇలాంటి వారి కోసమే కొన్ని బ్యాంకులు ప్రత్యేక రుణాలు అందిస్తున్నాయి. సరికొత్త స్కీమ్స్‌ ద్వారా రూ.25 లక్షల వరకు లోన్స్‌ ఇస్తున్నాయి. కార్‌ లోన్‌, హోంలోన్‌ తరహాలోనే ఈ మ్యారేజ్‌ లోన్‌ కూడా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల నుంచి సులభంగా పొందొచ్చు. ఈ రుణం ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పెళ్లి కోసం తీసుకునే లోన్స్‌ దాదాపు పర్సల్‌ లోన్స్‌ మాదిరిగానే ఉంటాయి. కాబట్టి పెళ్లి ఖర్చుల కోసం అని చెప్పి బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కస్టమైజ్‌డ్‌ వెడ్డింగ్‌ లోన్‌ కోరవచ్చు. లోన్‌ తీసుకునే ముందు వడ్డీ రేట్ల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. సాధారణంగా రుణాలకు సంబంధించి 6 నెలల నుంచి ఏడాది పాటు లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. కాబట్టి మీరు లోన్‌ నిర్ణీత సమయం ముందే చెల్లించడానికి అవకాశం ఉండదు. లోన్‌ తీసుకునే ముందు ప్రతి నెలా ఎంతా ఈఎంఐ చెల్లించాలో చూసుకోవాలి. మీ ఆదాయాన్ని బట్టి ఈఎంఐని నిర్ణయించుకోవాలి.

పెళ్లి కోసం రుణానికి దరఖాస్తు చేసేవారి అర్హత అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వెడ్డింగ్‌ లోన్‌ అర్హతలకు సంబంధించి బ్యాంకుల నియమ నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి.

కనీస వయస్సు: ఈ లోన్‌ తీసుకోవాలంటే దరఖాస్తుదారునికి కనీసం 23 ఏళ్లు ఉండాలి. కొన్ని బ్యాంకులు 21 ఏళ్ల వారికి కూడా రుణాలు ఇస్తాయి.

గరిష్ఠ వయస్సు: వివాహ రుణాలపై ఆసక్తి కలిగిన రుణ గ్రహీతల వయస్సు 58 సంవత్సరాలకు మించరాదు. అయితే స్వయం ఉపాధి రుణగ్రహీతలకు కొన్ని బ్యాంకులు 65 ఏళ్ల వచ్చే వరకు కూడా రుణాలు అందిస్తున్నాయి.

నెలవారి ఆదాయం: ఈ లోన్‌కి అర్హత పొందాలంటే దరఖాస్తుదారునికి స్థిర ఆదాయం ఖచ్చితంగా ఉండాలి. అందుకు సంబంధించి ఆదాయ వనరుల సరైన సాక్ష్యాలను బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం నెలవారి ఆదాయం రూ.25,000 కన్నా ఎక్కువగా ఉంటేనే రుణాలు ఇస్తామని ఎబుతున్నాయి.

క్రెడిట్‌ స్కోర్: ఏ లోన్‌ తీసుకోవాలన్నా క్రెడిట్‌ స్కోర్‌ చాలా ముఖ్యం. మీకు ఎంత రుణం ఇవ్వాలి? వడ్డీరేటు ఎంత ఉండాలి? వంటి నిర్ణయాలను బ్యాంకు అధికారులు ఈ క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగానే నిర్ణయిస్తారు. మీ సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే అధిక వడ్డీరేటు వేసే అవకాశం ఉంటుంది.

Next Story