క్రెడిట్‌ స్కోర్‌పై ఈ సందేహాలు ఉన్నాయా?

క్రెడిట్‌ కార్డును సరైన విధానంలో ఉపయోగిస్తే ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే క్రెడిట్‌ స్కోరును పెంచుకునే క్రమంలో కొందరు ఇబ్బందులు పడతారు.

By అంజి
Published on : 2 July 2025 9:40 AM IST

credit score, Credit card, Credit history

క్రెడిట్‌ స్కోర్‌పై ఈ సందేహాలు ఉన్నాయా?

క్రెడిట్‌ కార్డును సరైన విధానంలో ఉపయోగిస్తే ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే క్రెడిట్‌ స్కోరును పెంచుకునే క్రమంలో కొందరు ఇబ్బందులు పడతారు. ఈ నేథప్యంలో కొన్ని అపోహలకు గురవుతుంటారు. ఈ అపోహలను వీడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆదాయం అధికంగా ఉంటేనే క్రెడిట్‌ స్కోర్‌ మెరుగ్గా ఉంటుంది అనేది సరికాదు. సకాలంలో బిల్లులు చెల్లించడం, తక్కువ క్రెడిట్‌ వినియోగం వంటివే స్కోరు విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి.

కార్డును ఎక్కువగా వినియోగిస్తేనే స్కోర్‌ పెరుగుతుందని అందరూ అనుకుంటారు. కానీ క్రెడిట్‌ కార్డు లిమిట్‌లో 30 శాతం నుంచి 40 శాతం కంటే ఎక్కువ వాడకూడదు.

పాత క్రెడిట్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలు రద్దు చేసుకుంటే.. క్రెడిట్‌ స్కోరు పెరిగే అవకాశం ఉందనే వాదనలో నిజం లేదు. ఇలా చేస్తే క్రెడిట్‌ స్కోరు తగ్గే ప్రమాదం ఉంది. మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌కు క్రెడిట్‌ హిస్టరీ ఉండటం కూడా అవసరమే.

పడిపోయిన క్రెడిట్‌ స్కోర్‌ ఇక పెరగదు అనే ఆందోళన చాలా మందిలో ఉంటుంది. బిల్లులను సక్రమంగా చెల్లిస్తే క్రెడిట్‌ స్కోర్‌ కచ్చితంగా పెరుగుతుంది.

Next Story