పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపాలంటే పాన్ కార్డు కచ్చితంగా కావాలి. అయితే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట పెట్టుబడులు పెడుతుంటారు. ఇలా సమయంలో పిల్లలకు కూడా పాన్ కావాలా? అసలు పిల్లలకు పాన్ కార్డు ఇస్తారా? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..
18 ఏళ్త కన్నా తక్కువ వయస్సు ఉన్న వారు కూడా పాన్ కార్డు పొందవచ్చు. పిల్లలు కొత్తగా బ్యాంకు ఖాతా తెరవాలన్నా.. వారి పేరు మీద తల్లిదండ్రులు పెట్టుబడులు ప్రారంభిచాలన్నా కొన్నిసార్లు పాన్ కార్డు అవసరం అవుతుంది. దీని కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అప్లై విధానం మొత్తం పెద్దలకు ఉన్నట్టుగానే ఉంటుంది.
అయితే ఇందులో తల్లిదండ్రుల వివరాలు సమర్పించాలి. పేరెంట్స్ ఫొటోలు అప్‌లోడ్ చేయాలి. ఫామ్ 49ఏ ఉపయోగించి దానిపై గార్డియన్ తల్లిదండ్రుల సంతకం చేయాలి. అయితే ఈ పాన్‌కార్డులో పిల్లల ఫొటో, సంతకం ఉండదు. అందుకే ఈ పాన్‌కార్డు 18 ఏళ్ల తర్వాత నిరుపయోగంగా మారుతుంది. కాబట్టి మేజర్ అయిన తర్వాత మళ్లీ కొత్త పాన్‌కార్డుకి అప్లై చేసుకోవాలి.