కరోనా మహమ్మారి అనంతరం దేశంలో అన్నింటి ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా.. తాజాగా ఎల్‌పీజీ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. గృహావసరాలకు వినియోగించే 14 కేజీల సిలిండర్‌పై భారీగా వడ్డించాయి ఆయిల్ కంపెనీలు.
14 కేజీల సిలిండర్‌పై రూ.50 పెంచాయి. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1052కు చేరింది. ఇక డెలివరీ బాయ్స్ తీసుకునే రూ.30 కలిపితే రూ.1082 అవుతుంది. ఇక పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. చివరిసారిగా.. గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధరను మార్చి 22న పెంచిన విషయం తెలిసిందే.
కాగా.. ఈ నెల 1న 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ.2460 నుంచి రూ.2,563.50కి చేరిన సంగతి తెలిసిందే. వారం రోజుల వ్యవధిలోనే గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు.