బాదుడే బాదుడు.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర

Commercial LPG Cylinder price hiked.క‌రోనా మ‌హ‌మ్మారి మిగిల్చిన క‌ష్టాల నుంచి కోలుకోక ముందే సామ‌న్యుడికి షాక్ మీద షాక్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2022 8:39 AM IST
బాదుడే బాదుడు.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర

క‌రోనా మ‌హ‌మ్మారి మిగిల్చిన క‌ష్టాల నుంచి కోలుకోక ముందే సామ‌న్యుడికి షాక్ మీద షాక్ త‌గులుతోంది. ఇప్ప‌టికే ఓ ప‌క్క నిత్యం పెట్రోల్‌, డీజిల్ ధర‌లు పెరుగుతుండ‌గా.. తాజాగా మ‌రో ప‌క్క గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర భారీగా పెరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచేశాయి చ‌మురు సంస్థ‌లు. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరపై ఏకంగా రూ. 250 పెంచుతున్నట్లు ప్ర‌క‌టించేశాయి. పెరిగిన ధ‌ర‌లు నేటి నుంచే అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్లు తెలిపాయి.

తాజాగా పెంచిన ధ‌రతో హైదరాబాద్‌లో ఈ సిలిండర్ ధర రూ. 2,186 నుంచి రూ. 2,460కి పెరిగింది.ఇక దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధ‌ర రూ.2253కు చేరింది. కోల్‌కతాలో రూ.2,351, ముంబైలో రూ.2,205, చెన్నైలో రూ.2,406 గా ఉంది. అయితే ప్రస్తుతానికి గృహ అవసరాలకోసం వినియోగించే 14 కిలోల సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు చేయ‌లేదు. ఫలితంగా దాని ధర రూ. 1002 వద్ద నిలకడగా ఉంది. 10 రోజుల కిందటే డొమెస్టిక్ అంటే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను పెంచిన సంగ‌తి తెలిసిందే.

వాణిజ్య సిలిండర్ ధరల‌ను పెంచ‌డంతో టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, మెస్‌లలో రేట్లు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ఏం తినేట‌ట్లు లేదు.. ఏం కొనేటట్లు లేద‌ని సామాన్యుడు ఆవేద‌న చెందుతున్నాడు.

Next Story