సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన కెనరా బ్యాంక్
తమ కస్టమర్లకు కెనరా బ్యాంకు తీపి కబురు అందించింది.
By Knakam Karthik
సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన కెనరా బ్యాంక్
తమ కస్టమర్లకు కెనరా బ్యాంకు తీపి కబురు అందించింది. పొదుపు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ పాటించకపోతే విధించే జరిమానాను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ కొత్త రూల్ జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. దీంతో కెనరా బ్యాంక్‌లో ఎలాంటి సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారైనా ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించనందుకు ఎలాంటి ఛార్జీలు లేదా జరిమానాలు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని విభాగాల సేవింగ్స్ ఖాతాలకు ఈ నూతన నిబంధన వర్తిస్తుందని కెనరా బ్యాంకు స్పష్టం చేసింది.
కాగా ఈ మార్పుతో దేశంలోని ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ నిల్వ అవసరాన్ని పూర్తిగా తొలగించిన మొదటి బ్యాంకుగా కెనరా బ్యాంక్ నిలిచింది. అంటే, కస్టమర్లు ఖాతాదారులు తమ సేవింగ్స్ ఖాతాలలో ఎటువంటి రుసుములు లేకుండా జీరో బ్యాలెన్స్‌ను కూడా కొనసాగించవచ్చు. ఈ చర్య వల్ల కోట్లాది మంది పొదుపు ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుతుందని, పెనాల్టీల గురించి ఆందోళన చెందకుండా తమ ఖాతాలోని పూర్తి బ్యాలెన్స్‌ను లావాదేవీల కోసం స్వేచ్ఛగా ఉపయోగించుకోవడానికి వీలు కలుగుతుందని భావిస్తున్నారు.
"జూన్ 1 నుంచి, కెనరా బ్యాంక్ కనీస నిల్వ నిర్వహించనందుకు ఎటువంటి పెనాల్టీ విధించదు. ఇది సేవింగ్స్ ఖాతాదారులందరికీ వర్తిస్తుంది" అని బ్యాంక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో ఒక ప్రకటనలో తెలిపింది. "ఈ కొత్త విధానంతో, కెనరా బ్యాంక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులందరూ ఇప్పుడు అన్ని సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు సగటు నెలవారీ బ్యాలెన్స్‌కు సంబంధించిన పెనాల్టీలు లేదా రుసుముల నుంచి విముక్తి పొంది, నిజమైన 'మినిమమ్ బ్యాలెన్స్‌పై పెనాల్టీ లేని' సౌకర్యాన్ని ఆస్వాదిస్తారు" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Feel the freedom, bank the difference. Starting 1st June 2025, Canara Bank offers no penalty on non-maintenance of minimum balance. Applicable to all Savings Bank Account holders!#CanaraBank #YourAccountYourFreedom #PenaltyWaiver pic.twitter.com/fAALUO80MZ
— Canara Bank (@canarabank) June 1, 2025