టిక్‌టాక్ మాతృసంస్థ‌కు షాక్‌.. భార‌త్‌లోని బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్‌..!

ByteDance bank accounts - India.టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్‌ సంబందించిన బ్యాంకు ఖాతాలను అధికారులు సీజ్ చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2021 7:15 AM GMT
tiktok

టిక్ టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్‌కు మరో గ‌ట్టి ఎదురు దెబ్బ తగిలింది. టిక్‌టాక్‌, హ‌లో యాప్ బ్యాన్ కార‌ణంగా ఇప్ప‌టికే వేలకోట్లు న‌ష్టపోయిన మాతృసంస్థ బైట్ డాన్స్ కు చెందిన‌ బ్యాంకు ఖాతాల‌ను అధికారులు స్తంభింప‌జేశారు. కేంద్ర ప్ర‌భుత్వానికి చెల్లించాల్సిన ప‌న్నుల‌ను ఎగ్గొట్టింద‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో బైట్ డాన్స్‌ సంబందించిన బ్యాంకు ఖాతాలను అధికారులు సీజ్ చేశారు. బైట్ డాన్స్‌కు సిటీ బ్యాంకు, హెచ్‌ఎస్‌బిసి బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. వాటిని స్తంభింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఈ రెండు బ్యాంకుల నుంచి బైట్ డాన్స్ భారత విభాగం ఏ విధమైన డబ్బులను డ్రా చేయకుండా చూడాలని కూడా ఆదేశించింది.

మరే ఇతర బ్యాంకు ఖాతాలతో బైట్ డ్యాన్స్ టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ కు లింక్ ఉన్నా ఆ ఖాతాల నుంచి డబ్బులు బట్వాడా కాకుండా చూడాలని పేర్కొంది. గ‌త సంవ‌త్స‌రం టిక్‌టాక్‌ను నిషేదించిన త‌రువాత జ‌న‌వ‌రిలో భార‌త ఉద్యోగుల్లో అత్య‌ధికుల‌ను తొల‌గించింది. ఇంకా 1300 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు. వారంతా విదేశీ కార్య‌క‌లాపాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. కాగా.. భారత అధికారులు తీసుకున్న నిర్ణయంతో బైట్ డాన్స్‌ తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు.




Next Story