ఎయిర్‌టెల్ యూజర్స్‌కు బిగ్ షాక్.. ఆ ప్లాన్‌కు ఇక నుంచి నో డేటా

దేశంలోని ప్రముఖ టెలికాం నెట్‌వర్క్ కంపెనీల్లో ఒక్కటైన ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చింది.

By Knakam Karthik  Published on  22 Jan 2025 1:05 PM IST
national news, telecom companies, airtel, jio, bsnl,trai

ఎయిర్‌టెల్ యూజర్స్‌కు బిగ్ షాక్.. ఆ ప్లాన్‌కు ఇక నుంచి నో డేటా

దేశంలోని ప్రముఖ టెలికాం నెట్‌వర్క్ కంపెనీల్లో ఒక్కటైన ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. పలు రీచార్చ్ ప్లాన్లను సవరించినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరలవుతోంది. రూ.509 రీచార్జ్ ప్లాన్‌లో గతంలో ఇంటర్‌నెట్‌తో పాటు 84 రోజుల పాటు ఉచిత కాల్స్, 900 ఎస్‌ఎంఎస్‌లు చేసుకునే అవకాశం ఇచ్చింది. కాగా ప్రస్తుతం ఈ ప్లాన్‌ను మార్పు చేసిన ఎయిర్‌టెల్.. రూ.509తో రీచార్జ్ చేస్తే కేవలం 84 రోజుల పాటు ఉచిత కాల్స్, 900 ఎస్‌ఎంఎస్‌లు మాత్రమే చేసుకునే అవకాశం కల్పించింది.

ఇప్పటికే భారత్‌లోని టెలికం కంపెనీలు తమ యూజర్లకు వరుస షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న తరుణంలో లేటెస్ట్‌గా ఎయిర్‌టెల్ కూడా తమ యూజర్లకు షాక్ ఇచ్చిందని చెప్పక తప్పదు. ఇప్పటికే అమ‌లులో ఉన్న‌ రూ.509, రూ.1,999 ప్లాన్ల‌పై ఇంట‌ర్నెట్ సేవ‌లు తొలగించింది. గ‌తంలో రూ.509 రీఛార్జ్ ప్లాన్‌లో ఇంటర్నెట్‌తో పాటు, 84 రోజుల పాటు ఉచిత కాల్స్, 900 ఎస్‌ఎంఎస్‌లు చేసుకునే అవకాశం కల్పించింది. రూ.509తో ఇప్పుడు రీఛార్జ్ చేస్తే.. 84 రోజుల పాటు కేవలం ఉచిత కాల్స్, 900 ఎస్ఎంఎస్‌లు మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. అంటే.. ఇంటర్నెట్ ప్లాన్‌ను ఈ రీఛార్జ్ టారిఫ్ నుంచి తొలగించారు.ప్రస్తుతం దాదాపు అన్ని టెలికాం కంపెనీలు వాయిస్‌, ఎస్సెమ్మెస్‌తో పాటు డేటా కలగలిపిన ప్లాన్‌లు అందిస్తున్నాయి. ఇంటర్నెట్ అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రీఛార్జ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇదిలా ఉంటే గతంలో జియో, ఎయిర్ టెల్ సంస్థలు తమ రీఛార్జ్ ప్లాన్‌లను అమాంతం పెంచేయడంతో.. ఆగ్రహించిన యూజర్లు.. ప్రభుత్వ టెలికాం ఆయన BSNLకు మారారు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రైవేట్ టెలికాం సంస్థలు మళ్లీ యూజర్లను ఆకట్టుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వాయిస్, ఎస్ఎంఎస్‌ల కోసం స్పెఫల్ టారిఫ్‌ ప్లాన్లు తీసుకురావాలని ఆయా కంపెనీలను టెలికాం నియంత్రణ సంస్థ( ట్రాయ్) ఇటీవలే ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌టెల్ తన రెండు రీచార్జ్ ప్లాన్లలో డేటాను తొలగించినట్లు సమాచారం.

Next Story