ఈ నెల(అక్టోబర్)లో ఇప్పటికే 20 రోజులు గడిచిపోయాయి. మరో 11 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీపావళి పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి.
రేపు అనగా అక్టోబర్ 22 నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు. 23న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. సోమవారం దీపావళి పండుగ సందర్భంగా సెలవు. దీంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. కాబట్టి ఏదైన పని ఉంటే ఈ రోజే చేసుకోవడం మంచిది. లేదంటే మంగళవారం వరకు ఆగాల్సి ఉంటుంది.
ఇక.. అక్టోబర్ 27న భాయ్ దూజ్ /లక్ష్మీ పూజ సందర్భంగా గాంగ్టక్, ఇంఫాల్, కాన్పూర్, లక్నో ప్రాంతాల్లో బ్యాంకులు మూసిఉంటాయి. అక్టోబర్ 30న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి / సూర్య షష్ఠి దళ ఛత్ (ఉదయం) / ఛత్ పూజ సందర్భంగా అహ్మదాబాద్, పాట్నా, రాంచీ నగరాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి.