మనలో చాలా మందికి బ్యాంకుకు సంబంధించి ఎన్నో పనులు ఉంటాయి. అయితే ముందుగానే బ్యాంకులకు సెలవులు ఎప్పుడు ఉంటాయో తెలుసుకుంటే పనులు ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే ఇబ్బందులు తప్పవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) బ్యాంకులకు సంబంధించిన సెలవులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంటుంది. ఆగస్టు నెల పూర్తి కావొస్తుండగా, సెప్టెంబర్ నెల ప్రారంభం కానుంది. ఇక సెప్టెంబర్ నెలలో బ్యాంకులు దాదాపు 13 రోజులు మూసే ఉండనున్నాయి. అయితే వివిధ రాష్ట్రాల్లో ఈ సెలవులు వేర్వేరుగా ఉంటాయి.
సెప్టెంబర్ 1న గోవాలో వినాయక చవితి సెలవుంది. సెప్టెంబర్ 6న జార్ఖండ్‌లో కర్మ పూజ పేరుతో బ్యాంకు సెలవు ఉంది.
సెప్టెంబర్ నెలలో సెలవుల జాబితా ఇదే
సెప్టెంబర్ 1- వినాయక చవితి రెండవ రోజు
సెప్టెంబర్ 4 – ఆదివారం
సెప్టెంబర్ 6 – కర్మపూజ
సెప్టెంబర్ 7, 8 – ఓనం
సెప్టెంబర్ 9 – ఇంద్రజాత
సెప్టెంబర్ 10 -శ్రీ నరవణ గురు జయంతి, రెండవ శనివారం
సెప్టెంబర్ 11 – ఆదివారం
సెప్టెంబర్ 18 – ఆదివారం
సెప్టెంబర్ 21- శ్రీ నారాయణ గురు సమాధి
సెప్టెంబర్ 24 – నాలుగవ శనివారం
సెప్టెంబర్ 25 – ఆదివారం
సెప్టెంబర్ 26 – ఆదివారం