ఏప్రిల్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే
Banks to be closed on 9 days in April Month.బ్యాంకులకు ఏ రోజు సెలవులు ఉంటాయో తెలుసుకుంటే దానికి తగ్గట్లుగా
By తోట వంశీ కుమార్ Published on 24 March 2022 7:19 AM GMTబ్యాంకులకు ఏ రోజు సెలవులు ఉంటాయో తెలుసుకుని.. దానికి తగ్గట్లుగా మన పనిని ముందే పూర్తి చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ఇక ఏప్రిల్ నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు మూత పడనున్నాయో ఓ సారి చూద్దాం. ఏప్రిల్ నెలలో మొత్తంగా 9 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ ఆర్థిక సంవత్సరం తొలి రోజు.. అదే రోజు పాత ఆర్థిక సంవత్సర ఖాతాల ముగింపు కావడంతో బ్యాంకులు పని చేయవు. బెలాపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇంఫాల్, జమ్ము, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, శ్రీనగర్‌ల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
ఏప్రిల్ 2వ తేదీ నెలలో మొదటి శనివారం అయినప్పటికీ.. ఉగాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇక 3వ తేదీ ఆదివారం వారాంతపు సెలవు. ఏప్రిల్ 9 రెండో శనివారం 10వ తేదీ ఆదివారం కావడంతో ఈ రెండు తేదీల్లో సాధారణ సెలవులు ఉండనున్నాయి. ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి, మహావీర్ జయంతి, తమిళ నూతన సంవత్సరాది, వివిధ ప్రాంతాల్లో చైరావోబా, బిజు ఫెస్టివల్, బొహాగ్ బిహూ ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో బ్యాంకులు పని చేయవు. 15వ తేదీన గుడ్ ఫ్రైడేతోపాటు బెంగాల్ నూతన సంవత్సరాది, హిమాచల్ ప్రదేశ్ దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. 17వ తేదీ ఆదివారం సెలవు. ఏప్రిల్ 23వ తేదీ నాలుగో శనివారం, 24వ తేదీ ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు.
సాధారణంగా ప్రతి రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవులు. అయితే.. పైన పేర్కొన్న తేదీల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్న పండుగల కారణంగా సెలవులు ఉండనుండగా.. మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయన్న విషయాన్ని గుర్తించాలి.