Bank Holidays : ఏప్రిల్ నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. జాబితా ఇదే
ఏప్రిల్ నెలలో 15 రోజులు బ్యాంకులు మూత పడనున్నాయి. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉంటాయో తెలుసుకుని ముందుగానే పనులు పూర్తి చేసుకోండి
By తోట వంశీ కుమార్ Published on 25 March 2023 6:01 AM GMTఏప్రిల్ నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రాంరభం కానుంది. దీంతో పాటు అనేక మార్పులు జరగనున్నాయి. ఈసారి ఏప్రిల్ నెలలో బ్యాంకులకు చాలా సెలవులు రానున్నాయి.ఏ ఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా సెలవులు తెలుసుకోవడం ద్వారా బ్యాంకుల్లో ఏదైన పని ఉంటే ముందుగానే ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేసుకోవచ్చు. ఏప్రిల్‌లో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి.
ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవులు ఇవే..
ఏప్రిల్ 1 - బ్యాంకుల వార్షిక మూసివేత ఉంటుంది. ఐజ్వాల్, షిల్లాంగ్, సిమ్లా, చండీగఢ్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ కానున్నాయి
ఏప్రిల్ 2 - ఆదివారం
ఏప్రిల్ 4 - మహావీర్ జయంతి సందర్భంగా అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీలలో బ్యాంకులు సేవలు నిలిచిపోనున్నాయి.
ఏప్రిల్ 5 - బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 7 - గుడ్ ఫ్రైడే కారణంగా అగర్తల, అహ్మదాబాద్, గౌహతి, జైపూర్, జమ్మూ, సిమ్లా, శ్రీనగర్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలీ డే
ఏప్రిల్ 8 - రెండవ శనివారం
ఏప్రిల్ 9 - ఆదివారం
ఏప్రిల్ 14 - బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐజ్వాల్, భోపాల్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, షిల్లాంగ్, సిమ్లా మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలీ డే
ఏప్రిల్ 15 - విషు, బోహాగ్ బిహు, హిమాచల్ డే, బెంగాలీ న్యూ ఇయర్ కారణంగా అగర్తల, గౌహతి, కొచ్చి, కోల్‌కతా, సిమ్లా, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 16 - ఆదివారం
ఏప్రిల్ 18 - షాబ్-ఎ-కద్రాలో జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులకు హాలీ డే
ఏప్రిల్ 21- ఈద్-ఉల్-ఫితర్ కారణంగా అగర్తల, జమ్మూ, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురంలో బ్యాంకులు బంద్.
ఏప్రిల్ 22 - నాలుగో శనివారం
ఏప్రిల్ 23 - ఆదివారం
ఏప్రిల్ 30 - ఆదివారం