మీకు బ్యాంకులో ఏదైన పని ఉందా..? ఆగస్టు నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు తెరుచుకుంటాయి. బ్యాంకులు ఎప్పుడు మూసివేయబడతాయి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. బ్యాంకు లావాదేవీలను చేసుకునే వినియోగదారులకు సెలవు దినాలు తెలుసుకుని ముందుగా ప్లాన్ చేసుకుంటే.. పనికి సులభంగా ఉంటుంది. మొత్తంగా సెప్టెంబర్ నెలలో దేశ వ్యాప్తంగా 12 రోజులు బ్యాంకులు పనిచేయవు. బ్యాంకు హాలిడేస్.. రాష్ట్రం ప్రాతిపదికన మారుతుంటాయి. ఒక రాష్ట్రంలో సెలవు ఉంటే మరో రాష్ట్రంలో హాలిడే ఉండకపోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ క్లోజ్ ఉన్నా కూడా ఆన్ లైన్ బ్యాంకింగ్ సర్వీసులు పొందవచ్చు. ఏటీఏం, మొబైల్ బ్యాంకింగ్, ఆన్ లైన్ బ్యాంకింగ్ వంటి సేవలు లభిస్తాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. 7 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
సెప్టెంబర్‌లో సెలవులు ఇవే..
1) సెప్టెంబర్ 5 – ఆదివారం
2) సెప్టెంబర్ 8 – శ్రీమంత శంకరదేవ తిథి – (గౌహతి)
3) సెప్టెంబర్ 9 – తీజ్ (హరితాళిక) – (గ్యాంగ్‌టక్)
4) సెప్టెంబర్ 10 – గణేష్ చతుర్థి (అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగపూర్, పనాజీ)
5) సెప్టెంబర్ 11 – రెండవ శనివారం / గణేష్ చతుర్థి (2 వ రోజు) – (పనాజీ)
6) సెప్టెంబర్ 12 – ఆదివారం
7) సెప్టెంబర్ 17 – కర్మ పూజ – (రాంచీ)
8) సెప్టెంబర్ 19 – ఆదివారం
9) సెప్టెంబర్ 20 – ఇంద్రజాత్రా – (గ్యాంగ్‌టక్)
10) సెప్టెంబర్ 21 – శ్రీ నారాయణ గురు సమాధి రోజు – (కొచ్చి మరియు తిరువనంతపురం)
11) సెప్టెంబర్ 25 – నాల్గవ శనివారం
12) సెప్టెంబర్ 26 – ఆదివారం