నవంబర్‌లో బ్యాంకులు 17 రోజులు పనిచేయవు.. ఎప్పుడెప్పుడంటే..?
Bank Holidays in November month.మీకు బ్యాంకులో ఏదైన పని ఉందా..? నవంబర్ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు తెరుచుకుంటాయి.
By తోట వంశీ కుమార్ Published on 31 Oct 2021 11:55 AM GMTమీకు బ్యాంకులో ఏదైన పని ఉందా..? నవంబర్ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు తెరుచుకుంటాయి. బ్యాంకులు ఎప్పుడు మూసివేయబడతాయి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. బ్యాంకు లావాదేవీలను చేసుకునే వినియోగదారులకు సెలవు దినాలు తెలుసుకుని ముందుగా ప్లాన్ చేసుకుంటే.. పనికి సులభంగా ఉంటుంది. మొత్తంగా నవంబర్ నెలలో దేశ వ్యాప్తంగా 17 రోజులు బ్యాంకులు పనిచేయవు. బ్యాంకు హాలిడేస్.. రాష్ట్రం ప్రాతిపదికన మారుతుంటాయి. ఒక రాష్ట్రంలో సెలవు ఉంటే మరో రాష్ట్రంలో హాలిడే ఉండకపోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ క్లోజ్ ఉన్నా కూడా ఆన్ లైన్ బ్యాంకింగ్ సర్వీసులు పొందవచ్చు. ఏటీఏం, మొబైల్ బ్యాంకింగ్, ఆన్ లైన్ బ్యాంకింగ్ వంటి సేవలు లభిస్తాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. 8 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
బ్యాంకు హాలీడేస్ ఇవే..
1) నవంబర్ 1 - కన్నడ రాజ్యోత్సవ - బెంగళూరు, ఇంఫాల్
2) నవంబర్ 3 - నరక చతుర్ధశి
3)నవంబర్ 4 - దీపావళి అమావాస్య - హైదరాబాద్ సహా దాదాపు అన్ని రీజియన్లలో సెలవు
4) నవంబర్ 5 - గోవర్ధన్ పూజ - అహ్మదాబాద్, బెలాపూర్, బెంగళూరు, డెహ్రడూన్, గ్యాంగ్‌టక్, జైపూర్, కాన్‌పూర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్
5)నవంబర్ 6 - భాయ్ దూజ్ - గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్‌పూర్, లక్నో, షిమ్లా
6) నవంబర్ 7 - ఆదివారం
7) నవంబర్ 10 - ఛాత్ పూజ - పాట్నా, రాంచీ)
8) నవంబర్ 13 - రెండో శనివారం
9) నవంబర్ 14 - ఆదివారం
10) నవంబర్ 19 - గురునానక్ జయంతి - హైదరాబాద్ సహా దాదాపు అన్ని రీజియన్లలో సెలవు
11) నవంబర్ 21 - ఆదివారం
12) నవంబర్ 22 - కనకదాస జయంతి - బెంగళూరు
13) నవంబర్ 23 - సెంగ్ కుత్స్ నెమ్ - షిల్లాంగ్
14) నవంబర్ 27 - నాలుగో శనివారం
15) నవంబర్ 24 - లితిత్ దివాస్
16) నవంబర్ 27 - నాలుగో శనివారం
17) నవంబర్ 28 - ఆదివారం