మీకు బ్యాంకుల్లో ఏమైనా పని ఉందా..? అయితే.. వెంటనే అప్రమత్తం కండి. మే నెలలో బ్యాంకులకు ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకోండి. తద్వారా మీ పనులను ప్రణాళిక బద్దంగా పూర్తి చేసుకోండి. లేదంటే కొన్ని కష్టాలను ఎదుర్కొనక తప్పదు. ఆర్‌బీఐ బ్యాంక్ హాలీడేస్ క్యాలెండర్ ప్రకారం మే నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో మే నెలలో 8 రోజులు బ్యాంకులకు పని చేయవు.
తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సెలవులు ఇలా..
మే 1 - మే డే, ఆదివారం
మే 3 - రంజాన్ /అక్షయ తృతీయ
మే 8 - ఆదివారం
మే 14 - రెండో శనివారం
మే 15 - ఆదివారం
మే 22 - ఆదివారం
మే 28 - నాలుగో శనివారం
మే 29 - ఆదివారం
ఇక ఆర్‌బీఐ విడుదల చేసిన సెలవుల జాబితాలో రవీంద్ర నాథ్ ఠాగూర్ జయంతి(మే 9), బుద్ధ పూర్ణిమ(మే 19) కూడా ఉన్నప్పటికీ ఆ సెలవులు అన్ని రాష్ట్రాలకూ వర్తించవు. రవీంద్ర నాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో, బుద్ధపూర్ణిమ సందర్భంగా ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.