అల‌ర్ట్‌.. ఈ నెల‌లో బ్యాంకుల‌కు 14 రోజులు సెల‌వులు

Bank Holidays in July 2022 Banks to be closed for 14 days this month.మీకు బ్యాంకుల్లో ఏమైనా ఉందా..? ఏ ఏ రోజుల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 July 2022 4:18 AM GMT
అల‌ర్ట్‌.. ఈ నెల‌లో బ్యాంకుల‌కు 14 రోజులు సెల‌వులు

మీకు బ్యాంకుల్లో ఏమైనా ఉందా..? ఏ ఏ రోజుల్లో బ్యాంకుల‌కు సెల‌వులు ఉంటాయో తెలుసుకుంటే ప‌నులు చేసుకోవ‌డం చాలా సుల‌భంగా ఉంటుంది. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొక త‌ప్ప‌దు. ఇక జులై నెల‌లో బ్యాంకులు ఎన్ని రోజులు ప‌ని చేస్తాయి. ఎన్ని రోజులు మూత ప‌డ‌నున్నాయో ఓ సారి చూద్దాం. జులై నెల‌లో మొత్తం 14 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే.. బ్యాంకు సెల‌వులు అనేవి రాష్ట్రం ప్రాతిప‌దికన మారుతూ ఉంటాయ‌నే విష‌యాన్ని గుర్తించుకోవాలి. ఒక రాష్ట్రంలో బ్యాంక్‌కు సెల‌వు ఉంటే మ‌రో రాష్ట్రంలో ఉండ‌క‌పోవ‌చ్చు.

జులై నెల‌లో బ్యాంకు సెల‌వులు ఇవే..

01 జులై 2022 - రథ యాత్ర (భువనేశ్వర్, ఇంపాల్)

07 జులై 2022 - ఖార్చి పూజ (అగర్తల)

09 జులై 2022 - బక్రీద్ ( అన్ని రాష్ట్రాల్లో)

11 జులై 2022 - ఇద్- ఉల్ - అఝా (జమ్మూ శ్రీనగర్)

13 జులై 2022 - భాను జయంతి (గ్యాంగ్ టక్)

14 జులై 2022 - బెహ్ డింక్లమ్ (షిల్లాంగ్)

16 జులై 2022 - హరేలా (డెహ్రాడూన్)

26 జులై 2022 - కేర్ పూజ (అగర్తల)

వీకెండ్ హాలిడేస్ ఇలా

03 జులై 2022 - ఆదివారం

10 జులై 2022 - ఆదివారం

17 జులై 2022 - ఆదివారం

23 జులై 2022 - నాలుగో శనివారం

24 జులై 2022 - ఆదివారం

31 జులై 2022 - ఆదివారం

Next Story