మీకు బ్యాంకుల్లో ఏమైనా పని ఉందా..? ఏ ఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయో తెలుసుకుంటే పనులు చేసుకోవడం చాలా సులభంగా ఉంటుంది. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు. రేపటి నుంచి ఆగస్టు నెల ప్రారంభం కాబోతుంది. ఆగస్టు నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా జాబితాను విడుదల చేసింది. సాధారణంగా ప్రతి ఆదివారం, రెండవ, నాలుగో శనివారాలు దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవులు ఉంటాయి. వివిధ రాష్ట్రాల్లోని పలు స్థానిక పండుగల సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు పని చేయవు
ఆగస్టు నెలలో బ్యాంకు సెలవులు ఇవే..
ఆగస్టు 1 - దృపక షీ-జీ పండుగ (సిక్కిం మాత్రమే)
ఆగస్టు 7 - ఆదివారం
ఆగస్టు 8 - మొహర్రం (జమ్మూ కాశ్మీర్ మాత్రమే)
ఆగస్టు 9 - మొహరం (దేశంలోని పలు ప్రదేశాల్లో సెలవు)
ఆగస్టు 11,12 - రక్షా బంధన్
ఆగస్టు 13 - రెండవ శనివారం
ఆగస్టు 15 - స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 16 - పార్సీ నూతన సంవత్సరం (బేలాపూర్, ముంబై మరియు నాగ్‌పూర్)
ఆగస్టు 18- జన్మాష్టమి (భువనేశ్వర్, డెహ్రాడూన్, కాన్పూర్ మరియు లక్నో)
ఆగస్టు 19: జన్మాష్టమి
ఆగస్టు 20 - శ్రీ కృష్ణ అష్టమి (హైదరాబాద్ మాత్రమే)
ఆగస్టు 21 - ఆదివారం
ఆగస్టు 29- శ్రీమంత్ శంకర్‌దేవ్ జయంతి (గౌహతి మాత్రమే)
ఆగస్టు 31 - గణేష్ చతుర్థి/వినాయక చతుర్థి (అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్‌పూర్ మరియు పనాజీలో)