అలర్ట్.. డిసెంబర్ నెలలో 13 రోజులు బ్యాంకులకు సెలవులు
Bank Holidays December 2022 There Are 13 Holidays.మరికొద్ది రోజుల్లో డిసెంబర్ నెల ప్రారంభం కానుంది.
By తోట వంశీ కుమార్ Published on 18 Nov 2022 12:11 PM ISTనవంబర్ నెల పూర్తి కావొస్తోంది. మరికొద్ది రోజుల్లో డిసెంబర్ నెల ప్రారంభం కానుంది. డిసెంబర్ నెలలో ఏ ఏ రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో ముందస్తుగా తెలుసుకోవడం వల్ల సమయం వృధా కాకుండా పనులు పూర్తి చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన జాబితా ప్రకారం డిసెంబర్ నెలలో బ్యాంకులు 13 రోజులు మూసి ఉంటాయి. డిసెంబర్‌లో 3,4,10,11,18,24,25 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 24న క్రిస్మస్, నాలుగో శనివారంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి.
డిసెంబర్‌లో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..
డిసెంబర్ 3 – శనివారం (సెయింట్ జేవియర్స్ ఫీస్ట్, గోవాలో హాలీడే)
డిసెంబర్ 4 – ఆదివారం
డిసెంబర్ 10 – రెండో శనివారం
డిసెంబర్ 11 – ఆదివారం
డిసెంబర్ 12 – సోమవారం (పా-టాగన్ నెంగ్మింజ సంగం, మేఘాలయలో సెలవు)
డిసెంబర్ 18 – ఆదివారం
డిసెంబర్ 19 – సోమవారం (గోవా విమోచన దినం, గోవాలో బ్యాంకులకు సెలవు)
డిసెంబర్ 24 – శనివారం క్రిస్మస్, నాల్గవ శనివారం ( దేశవ్యాప్త బ్యాంకులకు సెలవు)
డిసెంబర్ 25 – ఆదివారం
డిసెంబర్ 26 – సోమవారం (క్రిస్మస్, లాసంగ్, నమ్సంగ్, మిజోరం, సిక్కిం, మేఘాలయలో హాలీడే)
డిసెంబర్ 29 – గురువారం (గురు గోవింద్ సింగ్ జి పుట్టినరోజు, చండీగఢ్‌లో సెలవు)
డిసెంబర్ 30 – శుక్రవారం (యు కియాంగ్ నంగ్వా, మేఘాలయలో హాలీడే)
డిసెంబర్ 31 శనివారం ( నూతన సంవత్సర వేడుకలు, మిజోరంలో బ్యాంకు మూసి ఉంటుంది.
కాగా.. సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. రాష్ట్రాల పండుగ ఆధారంగా బ్యాంకులు మూసి ఉంటాయి.