మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర
August 25th Gold price.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయన్నసంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 25 Aug 2021 2:30 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయన్నసంగతి తెలిసిందే. ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు వాటి ధరలవైపు నిత్యం దృష్టిపెడుతుంటారు. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు.. మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి. బుధవారం కూడా ధరలు పెరిగాయి. నేడు 10 గ్రాములపై దేశీయంగా రూ.200 మేర పెరిగింది. దేశంలో 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర రూ. 46,600 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర50,830గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,600, 24 క్యారెట్ల ధర50,830
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 46,650, 24 క్యారెట్ల ధర రూ. 47,650
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 44,450, 24 క్యారెట్ల ధర రూ.48,490
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,850, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,930
-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,450, 24 క్యారెట్ల ధర రూ.44,450
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 44,450, 24 క్యారెట్ల ధర రూ.44,450
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 44,450, 24 క్యారెట్ల ధర రూ.44,450
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.