ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనాలనుకునేవారికి షాక్..ధరలు పెంచిన ఆ కంపెనీ

ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది

By -  Knakam Karthik
Published on : 22 Dec 2025 4:08 PM IST

Business News, Ather, Electric Scooter,  price hike

ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనాలనుకునేవారికి షాక్..ధరలు పెంచిన ఆ కంపెనీ

ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ప్రకారం, జనవరి 1 నుండి తన మోడళ్ల ధరలను రూ. 3,000 వరకు పెంచనుంది. ముడి పదార్థాలు, ఎలక్ట్రానిక్స్ కోసం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ధరలు మరియు ప్రతికూల విదేశీ మారకపు రేట్ల కారణంగా ఈ ధర సర్దుబాటు జరిగింది.

ముడిసరుకు ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా కీలక ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు పెరగడం, ఫారెక్స్ ప్రభావం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఏథర్ వివరించింది. ప్రస్తుతం ఏథర్ 450 సిరీస్ పెర్ఫార్మెన్స్ స్కూటర్లు మరియు రిజ్తా ఫ్యామిలీ స్కూటర్లును మార్కెట్లో విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.1,14,546 నుంచి రూ.1,82,946 మధ్య ఉన్నాయి. ధరల పెంపు ఒక్కో మోడల్‌కు ఒక్కో విధంగా ఉండనుంది.

ఇక ప్రస్తుతం కంపెనీ ‘ఎలక్ట్రానిక్ డిసెంబర్’ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఇందులో ఎంపిక చేసిన నగరాల్లో ఏథర్ స్కూటర్ కొనుగోళ్లపై రూ.20,000 వరకు ప్రయోజనాలు అందిస్తున్నట్లు ప్రకటించింది.మరో వైపు అథర్ ఎనర్జీ షేర్లు ఈ ఏడాది మే నెలలో స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టాయి. ఈ స్టాక్ ఇప్పటికే రెండంకెల రాబడిని ఇచ్చింది, కేవలం 7 నెలల్లో దాని ఇష్యూ ధర నుండి 118% ర్యాలీ చేసింది.

Next Story