టాపప్‌ లోన్‌ తీసుకుంటున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోండి

మీకు ఇప్పటికే ఇంటి లోన్‌, వెహికల్‌ లోన్‌ ఉందా? మీ వ్యక్తిగత వ్యాపార అవసరాలకు మరింత లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

By అంజి  Published on  11 Dec 2023 12:00 PM IST
topup loan, Credit score, EMI, Bank loan

టాపప్‌ లోన్‌ తీసుకుంటున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోండి

మీకు ఇప్పటికే ఇంటి లోన్‌, వెహికల్‌ లోన్‌ ఉందా? మీ వ్యక్తిగత వ్యాపార అవసరాలకు మరింత లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే.. మీరు టాపప్‌ లోన్‌ తీసుకోవచ్చు. టాపప్‌ లోన్‌ తీసుకునే ముందు కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

టాపప్‌ లోన్‌ అంటే..

ఇప్పటికే మీకు బ్యాంక్‌ లోన్‌ ఉండి, వాటి ఈఎంఐలు సమయానికి కడుతూ, మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నవారికి బ్యాంకులు టాపప్‌ లోన్‌ ఇస్తాయి. అంటే.. పాత లోన్‌ అసలుకు,, మీకు మంజూరైన మొత్తాన్ని కలుపుతారు. దీని వల్ల లోన్‌ అమౌంట్‌, చెల్లించే పీరియడ్‌ కూడా పెరుగుతాయి.

పాత లోన్‌ మొత్తం, క్రెడిట్‌ స్కోరు, ఆదాయం, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి బ్యాంకు టాపప్‌ లోన్‌ మొత్తాన్ని నిర్ణయిస్తుంది. టాపప్‌ లోన్‌ కోసం కొత్తగా అప్లై చేయాల్సిన పని లేదు. స్పెషల్‌ ఫీజు కూడా లేదు. ఈ లోన్‌కు బ్యాంకు ఓకే అంటే దాన్ని ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు.

ఇంటి మరమ్మతు, పిల్లల చదువు, ఎక్కువ వడ్డీకి తెచ్చిన లోన్లు తిరిగి కట్టేందుకు టాపప్‌ లోన్‌ పని కొస్తుంది. అయితే.. నిజంగా అవసరం ఉంటేనే దీన్ని తీసుకోవాలి. టాపప్ లోన్‌ వల్ల ఎంత అదనంగా ఈఎంఐ కట్టాలో లెక్కించుకుంటే.. మన రీపేమెంట్‌ కెపాసిటీ మీద మరింత క్లారిటీ వస్తుంది.

పర్సనల్‌ లోన్‌ కంటే టాపప్‌ లోన్‌ మీద వడ్డీ తక్కువే అయినా.. రీపేమెంట్‌కు ఎక్కువ సమయం పెట్టుకునే కోద్దీ వడ్డీభారం పెరుగుతుంది. కొన్నిసార్లు అసలు కంటే వడ్డీయే ఎక్కువ కావచ్చు. మీకు 750 దాటిన క్రెడిట్‌ స్కోర్‌, మంచి రీపేమెంట్‌ హిస్టరీ ఉంటే కొంత తక్కువ వడ్డీకే బ్యాంకు టాపప్ లోన్‌ ఇచ్చే ఛాన్స్‌ ఉంది.

పర్సనల్‌ లోన్‌పై సాధారణంగా వడ్డీ రేటు 13-15 శాతం వరకూ ఉంటుంది. ఇంత అధిక వడ్డీకి తీసుకున్న రుణాలపై టాపప్‌ తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. వడ్డీ భారం అధికంగా ఉంటుంది. కాబట్టి, సాధ్యమైనంత వరకూ ఈ లోన్‌లు ఉన్న వారు టాపప్‌ లోన్‌కు దూరంగా ఉండటమే మంచిది.

Next Story