అమెజాన్ రష్యా, బెలారస్‌లో ఉన్న కస్టమర్‌లకు రిటైల్ ఉత్పత్తుల రవాణాను నిలిపివేసింది. రష్యాలోని అమెజాన్ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రైమ్ వీడియోకు వినియోగదారులకు ఇకపై యాక్సెస్‌ను అందించదు. కొత్త రష్యా, బెలారస్ ఆధారిత కస్టమర్‌లు, అమెజాన్ థర్డ్-పార్టీ విక్రేతలను ఇకపై అంగీకరించబోమని కంపెనీ తెలిపింది. "మేము రష్యాలో ఉన్న కస్టమర్‌ల కోసం ప్రైమ్ వీడియోకి యాక్సెస్‌ను కూడా సస్పెండ్ చేస్తున్నాము. మేము ఇకపై న్యూ వరల్డ్ కోసం ఆర్డర్‌లను తీసుకోము. ఇది మేము నేరుగా రష్యాలో విక్రయించే ఏకైక వీడియో గేమ్" అని వాణిజ్య దిగ్గజం అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఇప్పటికే అనేక ఇతర గేమింగ్ దిగ్గజాలు రష్యా దేశంలో తమ విక్రయాలను నిలిపివేశాయి. కొన్ని ఇతర యూఎస్ టెక్నాలజీ ప్రొవైడర్ల వలె కాకుండా, అమెజాన్, ఏడబ్ల్యూఎస్‌కి రష్యాలో డేటా సెంటర్లు, మౌలిక సదుపాయాలు లేదా కార్యాలయాలు లేవు. "రష్యన్ ప్రభుత్వంతో వ్యాపారం చేయకూడదనే దీర్ఘకాలిక విధానాన్ని మేము కలిగి ఉన్నాము" అని అమెజాన్ తెలిపింది.
అమెజాన్ యొక్క క్లౌడ్-కంప్యూటింగ్ యూనిట్ ఎడబ్ల్యూఎస్ ఉక్రెయిన్ దాడి తరువాత రష్యా లేదా బెలారస్‌లో ఉన్న కొత్త కస్టమర్‌లను ఇకపై అంగీకరించడం లేదని ప్రకటించింది. ఉక్రెయిన్‌లో మానవతా అవసరాలకు మద్దతుగా అనేక ఎన్‌జీవోలు, సంస్థలతో భాగస్వామిగా కొనసాగుతోందని కంపెనీ తెలిపింది. "అమెజాన్ యుద్ధ ప్రభావితమైన వారికి మద్దతుగా 5 మిలియన్ల డాలర్లను విరాళంగా అందించింది. మేము మా ఉద్యోగుల విరాళాలను సరిపోల్చడం కొనసాగిస్తున్నాము. 10,000 మంది ఉద్యోగులు ఈ ప్రయత్నానికి విరాళాలు అందించారని మేము సంతోషిస్తున్నాము" అని అది తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పదివేల మంది కస్టమర్లు అమెజాన్ హోమ్ పేజీల ద్వారా కూడా విరాళాలు ఇచ్చారు. అమెజాన్‌తో పాటు, యాపిల్, మైక్రోసాఫ్ట్, సామ్‌సంగ్, నెట్‌ప్లిక్స్, పేపల్ వంటి అనేక టెక్ ప్లేయర్‌లు రష్యాతో వ్యాపారం చేయడం మానేశారు. వీసా, మాస్టర్‌కార్డ్‌లు కూడా దేశంలో కార్యకలాపాలను నిలిపివేసాయి.