సబ్‌స్క్రిప్ష‌న్‌ ధరలను పెంచేస్తున్న ప్రైమ్ వీడియో

Amazon Prime subscription price in India to be hiked. అమెజాన్ ప్రైమ్ వీడియో.. కొత్త కొత్త షోలను, సరి కొత్త సినిమాలను అందిస్తూ వస్తోంది.

By M.S.R  Published on  24 Oct 2021 3:05 PM IST
సబ్‌స్క్రిప్ష‌న్‌ ధరలను పెంచేస్తున్న ప్రైమ్ వీడియో

అమెజాన్ ప్రైమ్ వీడియో.. కొత్త కొత్త షోలను, సరి కొత్త సినిమాలను అందిస్తూ వస్తోంది. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో రాబోయే రోజుల్లో ధరలను పెంచబోతోంది. అమెజాన్ త్వరలో ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ల ధరలను మార్చనుంది. ఈ విషయాన్ని కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ధృవీకరించింది. ధరల్లో మార్పుకు సంబంధించి ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు.. అయితే ఇది త్వరలో జరుగుతుందని నొక్కి చెబుతోంది. అమెజాన్ ప్రైమ్ యొక్క నెలవారీ సబ్‌స్క్రిప్ష‌న్‌ ధర రూ. 179 ఉండబోతోంది..

వార్షిక సభ్యత్వాన్ని కొనుగోలు చేసే వారు రూ. 1,499 చెల్లించాల్సి ఉంటుంది. త్రైమాసిక సబ్‌స్క్రిప్ష‌న్‌ ధర రూ .459 ఉండనుంది. వినియోగదారులు 30 రోజుల సబ్‌స్క్రిప్షన్‌ని రూ. 129 కి కొనుగోలు చేయవచ్చు. త్రైమాసిక ప్లాన్ రూ. 329 కి అందుబాటులో ఉంది, అయితే వార్షిక ప్లాన్ కావాలంటే రూ .999 చెల్లించాల్సి ఉంది. మీ ప్రస్తుత ప్లాన్‌, మీ ఉచిత ట్రయల్‌పై అదనపు ఛార్జీ విధించదని అమెజాన్ ధృవీకరించింది. సభ్యత్వ వ్యవధి ముగిసిన తర్వాత కొత్త ధరలు అమలు అవుతాయి. 'లాస్ట్‌ ఛాన్స్‌ జాయిన్‌ ప్రైమ్‌' పేరుతో ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఒక యాడ్‌ను విడుదల చేసింది. అప్పటి నుండి ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌కు రేట్లు పెరగనున్నాయనే వార్త వైరల్ అవుతూ రాగా.. తాజాగా అది నిజమే అని వెల్లడైంది.


Next Story