అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ షాకింగ్ నిర్ణయం!

Amazon CEO Jeff Bezos to step down later this year. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

By Medi Samrat
Published on : 3 Feb 2021 8:38 AM IST

Amazon CEO Jeff Bezos to step down later this year

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అమెజాన్ సీఈవోగా త్వరలో తప్పుకుంటానని ప్రకటించారు. కొత్త ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి అమెజాన్‌లో అన్ని రకాల బాధ్యతల నుంచి ఆయన వైదొలగబోతోన్నారు. తన వారసుడిని కూడా ఖరారు చేశారు. ఆయన పేరును ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన రిటైర్‌మెంట్‌ వార్త బయటకు రాగానే అమెజాన్‌ వర్కర్స్, వినియోగదారులు షాక్‌ అవుతున్నారు.

అయితే బెజోస్ తర్వాత అమెజాన్ సీఈవోగా ఆండీ జాసీని నియమించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి ఆండీ అమెజాన్ వెబ్ సర్వీసుల హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. 1994లో అమెరికాలోని సియాటెల్ ప్రధాన కేంద్రంగా ఓ చిన్న స్టార్టప్‌గా ఆవిర్భవించింది.. అమెజాన్. ఆన్‌లైన్ బుక్ స్టోర్‌గా ప్రారంభంలో సర్వీసులను అందించిందా కంపెనీ. ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో ఉన్నత శిఖరాలకు ఎదిగారు.

ఒక్క ఫోన్ కాల్‌తో ఇంటికే తెప్పించుకునే సదుపాయాన్ని కల్పించడంతో ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సర్వీసులను కోట్లాదిమంది ఆదరించారు. సీఈవోగా తప్పుకున్నప్పటికీ అడ్వైజర్‌గా కొనసాగుతానని ఈ లేఖలో పేర్కొన్నారు. రిటైర్‌మెంట్ తర్వాత సేవాకార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.


Next Story