దుమ్ముదులిపే స్పీడ్ లో ఎయిర్ టెల్.. హైదరాబాద్ లో ట్రయల్ చూశారుగా..

Airtel tests 5G over commercial network in Hyderabad.5జీ నెట్వర్క్ కోసం అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jan 2021 3:03 PM GMT
Airtel tests 5G over the commercial network in Hyderabad

5జీ నెట్వర్క్ కోసం అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది వినియోగదారులు 4జీ ని బాగా యూజ్ చేసుకుంటూ ఉంటుంటే.. ఇక 5జీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఎయిర్ టెల్ సంస్థ 5జీ సర్వీసుల కోసం హైదరాబాద్ లో గురువారం వాణిజ్య నెట్ వర్క్ లపై డెమో ఇచ్చింది.

నాన్ స్టాండ్ అలోన్ (ఎన్ఎస్ఏ) నెట్ వర్క్ టెక్నాలజీ ద్వారా 1800 మెగాహెర్జ్ బ్యాండ్ లో 5జీ, 4జీ రెండింటినీ సమాంతరంగా పనిచేయించి చూపించారు. ఎయిర్ టెల్ 5జీ నెట్ వర్క్ 10 రెట్లు ఎక్కువగా పని చేస్తోందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఓ సినిమాను కేవలం కొన్ని క్షణాల్లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చని.. తమకు పరికరాలను అందించే ఎరిక్సన్ తో కలిసి కొత్త 5జీని ఆవిష్కరించినట్టు ఎయిర్ టెల్ చెబుతోంది.

1800 మెగాహెర్జ్, 2100, 2300 మెగాహెర్జ్ ల తరంగదైర్ఘ్యాల వద్ద 5జీ పనిచేస్తుంది. ఇటు సబ్ గిగాహెర్జ్ బ్యాండ్స్ అయిన 800 మెగా హెర్జ్, 900 మెగా హెర్జ్ వద్ద కూడా మంచి సేవలు అందుతాయని..కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే కొన్ని నెలల్లోనే దానిని అందుబాటులోకి తెస్తామని ఎయిర్ టెల్ సంస్థ చెబుతోంది. ఇప్పుడున్న స్పెక్ట్రమ్ పరిధిలోనే తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది.భారతీ ఎయిర్ టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఓకే చెప్పిన వెంటనే 5జీని తెస్తామని, దానికి సంబంధించిన అన్ని స్పెక్ట్రమ్ బ్యాండ్స్ సరిపోనూ ఉన్నాయని అన్నారు.


Next Story