ఎయిర్‌టెల్‌ మరో షాకింగ్‌ న్యూస్‌..పెంపు తప్పదంటూ కస్టమర్లకు

Airtel Says Tariff Hike Expected in 2022. ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌.. తన కస్టమర్లకు మరో షాకింగ్‌ వార్త చెప్పింది. తాజాగా మూడో త్రైమాసిక

By అంజి  Published on  10 Feb 2022 8:17 AM GMT
ఎయిర్‌టెల్‌ మరో షాకింగ్‌ న్యూస్‌..పెంపు తప్పదంటూ కస్టమర్లకు

ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌.. తన కస్టమర్లకు మరో షాకింగ్‌ వార్త చెప్పింది. తాజాగా మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన ఎయిర్‌టెల్‌.. మరోసారి టారిఫ్‌ రేట్ల పెంపు ఉంటుందని తెలిపింది. ఇటీవలే అన్ని టెలికాం కంపెనీలు రీఛార్జ్‌ రేట్లను విపరీతంగా పెంచేశాయి. దీంతో సామాన్య ప్రజలు రీఛార్జ్‌ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రీఛార్జ్‌ రేట్లు పెంచుతామన్న ఎయిర్‌టెల్‌.. వచ్చే మూడు, నాలుగు నెలల్లో ఛార్జీల పెంపు ఉండదని కాస్తా ఉపశమనం కలిగించింది. కానీ 2022 సంవత్సరం ముగిసే లోపు ఎదో ఒక రోజు రేట్ల పెంపు తప్పదని తెలిపింది. ఈ నిర్ణయంలో వెనుకడుగు వేసేది లేదని, ఛార్జీల పెంపు నిర్ణయం తప్పనిసరి అని పేర్కొంది.

రాబోయే కాలంలో ప్రతి వినియోగదారుడి నుండి నెల వారీ ఆదాయాన్ని రూ.200 లకు తీసుకువేళ్లేందుకు ఎయిర్‌టెల్‌ సిద్ధమైంది. తాజా ప్రకటనతో ఎన్‌ఎస్‌ఈలో ఎయిర్‌టెల్‌ షేర్‌ ధర రూ.1.55 శాతం పెరిగి రూ.719.90 దగ్గర ముగిసింది. గత డిసెంబర్‌ త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ రూ.830 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అమెరికా టెక్‌ దిగ్గజం గూగుల్‌ పెట్టబడులు, గతంలో ఛార్జీల పెంపుతో తాజా ఎయిర్‌టెల్‌ త్రైమాసికంలో మంచి ఫలితాల వచ్చాయి. నాలుగో త్రైమాసికంలోనూ పెంచిన ఛార్జీల ప్రయోజనాలు కనిపిస్తాయని, నిధుల కొరత లేదని ఎయిర్‌టెల్‌ సీఈవో గోపాల్‌ విట్టల్‌ అన్నారు.

Next Story