ఓయో కంపెనీ: లాభాలు 4 రెట్లు.. నష్టాలు 6 రెట్లు..!

By అంజి  Published on  27 Nov 2019 3:36 AM GMT
ఓయో కంపెనీ: లాభాలు 4 రెట్లు.. నష్టాలు 6 రెట్లు..!

ఢిల్లీ: ప్రముఖ ఆతిథ్య సేవారంగ సంస్థ ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ భారీ నష్టాలను మూటగట్టుకుంది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను ఓయో హోటల్స్‌కు రూ.2,384.69 కోట్ల నష్టాలు వచ్చాయి. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు నాలుగు రెట్లకుపైగా పెరిగిన.. నష్టాలు మాత్రం ఆరు రెట్లు నష్టాలు పెరిగాయి. రిజిస్టార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వద్ద కంపెనీ దాఖలు చేసిన మదింపు మేరకు ఈ విషయం వెల్లండైంది. 2017-18 సంవత్సరంలో రూ.360 కోట్లు ఓయో సంస్థ నష్టపోయింది. ఫలితంగా ఐఓపీకి వెళ్లడానికి మరింత సమయం పట్టవచ్చని వ్యాపార విశ్లేషకులు చెబుతున్నారు.గతేడాదికిగాను సంస్థ రూ.6,456.90 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని ఓయో సంస్థ ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,413 కోట్లని ఓయో రిజిస్ట్రార్‌‌ ఆఫ్‌ ‌కంపెనీస్‌‌కు అందజేసిన వాల్యుయేషన్‌ ‌రిపోర్టులో వెల్లడించింది.

లాభ, నష్టాలను కంపెనీ వాల్యుయర్ రూపొందించినవని, కానీ ఆడిటర్లు తయారు చేసినవి కావని కంపెనీ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకైతే ఆడిటింగ్ నిర్వహించలేదని కంపెనీ వర్గాలు తెలిపాయి. గతేడాదిలో సంస్థ నిర్వహణ ఖర్చులు రూ. 1,246.84 కోట్ల నుంచి రూ. 6,131.65 కోట్లకు చేరుకోవడం వల్లనే భారీ నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఇదే కాలంలో ఉద్యోగుల కోసం చేసిన ఖర్చులు ఆరు రెట్లు పెరిగి రూ.1,539 కోట్లకు చేరాయి. జూన్ 2019 నాటికి ఓయో నికర విలువ 5.32 బిలియన్ డాలర్లుగా ఉన్నది. మన కరెన్సీలో ఇది రూ.36,658.34 కోట్లకు పైమాటే. రాబోయే రెండు మూడేళ్లలో 18 బిలియన్‌ డాలర్ల వాల్యుయేషన్‌ ఐఓపీ ప్రకటించాలని ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ సంస్థ భావిస్తోంది.

Next Story