బ్రేకింగ్: బస్సు దగ్ధం.. మంటల్లో 50 మంది ప్రయాణికులు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కన్నౌజ్ లో ఒక  ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు బస్సు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. బస్సు కన్నౌజ్ నుంచి జైపూర్ కు వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.