ఏపీలోని నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మనుబోలు జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో 22 మందికి గాయాలయ్యాయి. బస్సులో 50 మంది ఉన్నారు. గాయాలైన వారిలో 18 మంది సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్లు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మనుబోలు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయడిన ఓ కానిస్టేబుల్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా, బస్సు డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు బెంగళూర్‌ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.